Yuzendra Chahal : యుజేంద్ర చాహల్ అద్భుత రికార్డు.. అశ్చర్యపోతున్న సెలెక్టర్లు!
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీతో పాటు, ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్ కు యుజేంద్ర చాహల్ (Yuzendra Chahal) ను పక్కనపెట్టారు. సెలెక్టర్లు తనని ఎంపిక చేయడంతో విజయ హజరే ట్రోఫీలో హర్యానాకు ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ పై ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టి, తనను పక్కన పెట్టిన బీసీసీఐ (BCCI) సెలక్టర్లను అశ్చర్యపరిచేలా చేస్తున్నారు. అదే విధంగా ఈ మ్యాచులో చాహల్ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. చాహల్ లిస్ట్ ఎ క్రికెట్‌లో కెరీర్‌లో 200 వికెట్లు పడగొట్టిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు.
టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన ఇండియన్ బౌలర్ గా చాహల్
33 ఏళ్ల యుజ్వేంద్ర చాహల్ టీ20ల్లో ఎక్కువ వికెట్లు తీసిన ఇండియన్ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. 2016లో టీమిండియా తరుఫున అరంగేట్రం చేసిన చాహల్.. 80 టీ20 మ్యాచ్‌లు ఆడి 96 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు చాహల్ ను ఎంపిక చేయలేదు. బ్యాటింగ్ చేయలేడనే కారణంతోనే యుజ్వేంద్ర చాహల్‌ను పక్కనబెడుతున్నట్లు క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. వీటికి తోడు జట్టులో అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ వంటి ఆల్‌రౌండర్లు పెరుగుతుండటం కూడా చాహల్ అవకాశాలకు గండి పడుతోంది.