Page Loader
పీసీబీ మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్‌గా జాకా అష్రఫ్ నియామకం 
పీసీబీ మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్‌గా జాకా అష్రఫ్

పీసీబీ మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్‌గా జాకా అష్రఫ్ నియామకం 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 06, 2023
03:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్‌గా జాకా అష్రాఫ్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని పీసీబీ గురువారం ప్రకటించింది. అష్రాఫ్ 10 మంది సభ్యుల కమిటీకి నాయకత్వం వహించనున్నాడు. ఇందులో మాజీ క్రికెటర్ జహీర్ అబ్బాస్ కూడా ఉన్నారు. పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ నవాజ్‌, పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీలు బోర్డు ఛైర్మన్‌గా తమ వ్యక్తులే ఉండాలని పట్టుబట్టడంతో గతంలో పీసీబీ రేసు నుంచి నజం సౌథీ తప్పుకున్న విషయం తెలిసిందే. గత నెలలోనే అతను తప్పుకోవడంతో జకా అష్రాఫ్ ను నియమించేందకు మార్గం సుగమమైంది.

Details

అష్రఫ్ ఎంపికతో పీసీబీలో కొత్త పరిమాణాలు

పిసిబి 10 మంది సభ్యుల కమిటీలో కలీమ్ ఉల్లా ఖాన్, అషాఫక్ అక్తర్, ముస్సాదిక్ ఇస్లాం, అజ్మత్ పర్వేజ్, జహీర్ అబ్బాస్, ఖుర్రం సూమ్రో, ఖవాజా నదీమ్, ముస్తఫా రామ్‌డే జుల్ఫికర్ మాలిక్ ఉన్నారు. పిసిబి ఎన్నికలు జూన్ 27న జరగాల్సి ఉంది. అయితే అష్రఫ్ ఎంపికను నిరసిస్తూ పలువురు మాజీ మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో ఎన్నికలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. కొత్త పీసీబీ చైర్మన్ కోసం కొత్త బోర్డ్ ఆఫ్ గవర్నర్ ఓటు వేస్తారు, ఇందులో పీఎం నామినేట్ చేసే ఇద్దరు సభ్యులు కూడా ఉంటారు. ఆసియా కప్ నేపథ్యంలో పాక్ జట్టును ఇండియాకు పంపే విషయంపై నూతన చైర్మన్ సుమఖంగా లేనట్లు తెలుస్తోంది.