Heath Steak: క్యాన్సర్‌తో జింబాబ్వే దిగ్గజ క్రికెటర్ హీత్ స్టీక్ కన్నుమూత
జింబాబ్వే క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్(49) కన్నుమూశారు. 49ఏళ్ల హీత్ స్ట్రీక్ క్యాన్సర్ తో పోరాడి ఆదివారం వేకువజామున తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. జింబాబ్వే క్రికెట్‌ను ఉన్నత స్థాయికి చేర్చడంతో హీత్ స్ట్రీక్ కీలక పాత్ర పోషించాడు. ఆల్ రౌండర్ గా జింబాబ్వే జట్టుకు ఎన్నో మరుపురాని విజయాలను అందించాడు. సెప్టెంబర్ 3, 2023 ఆదివారం, తన జీవితంలో గొప్ప ప్రేమ, తన అందమైన పిల్లల తండ్రి, తన ఇంటి నుండి దేవదూతలతో ఉండటానికి తీసుకెళ్లారని, అక్కడ అతను తన చివరి రోజులను తన చుట్టూ గడపాలని కోరుకున్నాడని హీత్ స్ట్రీక్ భార్య తన ట్విట్టర్ ద్వారా రాసుకొచ్చింది.
హీత్ స్ట్రీక్ సాధించిన రికార్డులివే
జింబాబ్వే తరుఫున హీత్ స్ట్రీక్ 1993 నుంచి 2005 వరకు 65 టెస్టులు, 189 వన్డేలను ఆడాడు. కెప్టెన్ గానూ స్ట్రీక్ రెండు ఫార్మాట్లో కలిపి 4933 పరుగులు, 455 వికెట్లను పడగొట్టాడు. ఇప్పటికీ జింబాబ్వే తరుఫున టెస్టుల్లో 1000 పరుగులు, 100 వికెట్లు, టెస్టుల్లో 2 వేల పరుగులు, 200 వికెట్లు పైగా తీసిన ఆటగాడిగా హీత్ స్ట్రీక్ చరిత్రకెక్కాడు. అదే విధంగా బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు బౌలింగ్ కోచ్ గానూ హీత్ స్ట్రీక్ విధులు నిర్వహించారు. నెల క్రితం హీత్ స్ట్రీక్ మరణించినట్లు వార్తలు రాగా, అయితే వాటిని హీత్ స్ట్రీక్ ఖండించిన విషయం తెలిసిందే.