వన్డే ప్రపంచ కప్ నుంచి జింబాబ్వే నిష్క్రమణ
ఈ వార్తాకథనం ఏంటి
ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023కు జింబాబ్వే కూడా అర్హత సాధించలేకపోయింది. మెగా టోర్నీకి అర్హత సాధించాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచులో జింబాబ్వే చేతులెత్తేసింది.
లీగ్ దశ ఆడిన ప్రతి మ్యాచులోనూ విజయం సాధించిన జింబాబ్వే, బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో అద్భుత ప్రదర్శన చేసింది.
అయితే వరుసుగా రెండు మ్యాచులు ఓడిపోవడంతో అనూహ్యంగా ప్రపంచకప్‌కు దూరమైంది. మంగళవారం స్కాట్లాండ్ చేతిలో జింబాబ్వే 31 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
మొదట బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 8 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది.లియాస్క్ (48), క్రాస్ (38), మెక్‌ములెన్ 34 రన్స్ తో జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించారు.
అనంతరం జింబాబ్వే 41.1 ఓవర్లలో 203 పరుగులకే ఆలౌటైంది.
Details
ప్రపంచ కప్ బెర్తు రేసులో స్కాట్లాండ్, నెదర్లాండ్స్
స్కాట్లాండ్ సూపర్-6లో వరుసగా వెస్టిండీస్, జింబాబ్వేలను ఓడించి ఆ జట్లను ఇంటికి పంపించడం విశేషం. ఇప్పటికే వరల్డ్ కప్ బెర్తును శ్రీలంక సొంతం చేసుకుంది.
ఇక రెండో బెర్తు కోసం స్కాట్లాండ్, నెదర్లాండ్స్ జట్లు పోటీపడుతున్నాయి. గురువారం జరిగే చివరి మ్యాచులో ఆ రెండు జట్లు తలపడనున్నాయి.
ఈ మ్యాచులో స్కాట్లాండ్ గెలిస్తే ఆ జట్టుకే బెర్తు కన్ఫామ్ అవుతుంది. నెట్‌రన్‌రేట్‌లో స్కాట్లాండ్ (+0.296), నెదర్లాండ్స్ (-0.042) ఉన్నాయి.
ఒక వేళ స్కాట్లాండ్ ఓడినా నెదర్లాండ్స్ కంటే రన్ రేట్ తక్కువ కాకుండా చూసుకుంటే ఆ జట్టుకే ప్రపంచకప్ 2023కు అర్హతసాధించే అవకాశం ఉంది.