Page Loader
Newyork: న్యూయార్క్ పార్క్‌లో కాల్పులు.. ఒకరు మృతి, పలువురికి గాయలు 
న్యూయార్క్ పార్క్‌లో కాల్పులు

Newyork: న్యూయార్క్ పార్క్‌లో కాల్పులు.. ఒకరు మృతి, పలువురికి గాయలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 29, 2024
08:53 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలోని న్యూయార్క్‌లోని ఓ పార్కులో జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటన న్యూయార్క్‌లోని రోచెస్టర్ సిటీ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం 6.20 గంటల ప్రాంతంలో మాపుల్‌వుడ్ పార్క్‌లో కాల్పుల శబ్దాలు వినిపించాయని, అక్కడ పలువురు గాయపడ్డారని తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ కాల్పుల్లో 20 ఏళ్ల యువకుడు మృతి చెందగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి. కాల్పులకు గల కారణం ఇంకా తెలియరాలేదు.

వివరాలు 

గాయపడిన ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా, మరో ఐదుగురికి స్వల్ప గాయాలు 

నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనలో గాయపడిన ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా, మరో ఐదుగురు స్వల్ప గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో మృతి చెందిన యువకుడి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. పార్క్‌లో పెద్ద సంఖ్యలో ప్రజలు ఉన్నారని, బుల్లెట్లు పేల్చడంతో తొక్కిసలాట జరిగిందని పోలీసులు తెలిపారు. ఘటనపై పోలీసులు ఆ ప్రాంతమంతా చుట్టుముట్టి దర్యాప్తు చేస్తున్నారు.