Page Loader
Plane Crash: అరిజోనాలో 2 విమానాలు ఢీకొని.. ఇద్దరు మృతి 
అరిజోనాలో 2 విమానాలు ఢీకొని.. ఇద్దరు మృతి

Plane Crash: అరిజోనాలో 2 విమానాలు ఢీకొని.. ఇద్దరు మృతి 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 20, 2025
08:56 am

ఈ వార్తాకథనం ఏంటి

అగ్రరాజ్యమైన అమెరికాలో విమాన ప్రమాదాలు వరుసగా జరుగుతూనే ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన నెల రోజుల్లోనే నాలుగు విమాన ప్రమాదాలు చోటుచేసుకోగా,తాజాగా మరో రెండు విమానాలు ప్రమాదానికి గురయ్యాయి. ఆరిజోనా రాష్ట్రంలో రెండు చిన్న విమానాలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి.ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం ఉదయం (స్థానిక కాలమానం ప్రకారం) టస్కాన్ శివార్లలోని మారానా రీజినల్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఈ ప్రమాదం సంభవించినట్లు ఫెడరల్ ఎయిర్ సేఫ్టీ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో విమానాలు నేలకూలి భారీగా మంటలు వ్యాపించినట్లు తెలిపారు. రెండు విమానాల్లో ఉన్న ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. గత నెల రోజుల వ్యవధిలో అమెరికాలో ఇది ఐదో విమాన ప్రమాదంగా నమోదైంది.

వివరాలు 

 వాషింగ్టన్ ప్రమాదంలో 67 మంది మృతి

జనవరిలో వాషింగ్టన్ సమీపంలో ఒక మిలిటరీ హెలికాప్టర్,అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ప్రయాణికుల విమానం ఢీకొన్నఘటనలో 67 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నెల మొదటివారంలో ఫిలడెల్ఫియాలో ఒక విమానం నివాస ప్రాంతంలో కుప్పకూలింది.ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. అంతే కాకుండా,గత వారంలో ఆరిజోనాలో లియర్‌జెట్‌ 35ఏ విమానం ల్యాండింగ్ అనంతరం రన్‌వేపై అదుపు తప్పి ర్యాంప్ వద్ద ఉన్న బిజినెస్ జెట్‌ను ఢీకొట్టింది. స్కాట్‌డేల్ ఎయిర్‌పోర్ట్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనలో ఒకరు మరణించగా,మరో నలుగురు గాయపడ్డారు.

వివరాలు 

కెనడాలో ప్రమాదం 

ఇక రెండు రోజుల క్రితం ఫిలడెల్ఫియాలో మెడికల్ ట్రాన్స్‌పోర్ట్ జెట్ విమానం కుప్పకూలి ఏడుగురు మరణించగా, 19 మంది గాయపడ్డారు. అదనంగా, ఈ నెల 18న అమెరికా నుంచి కెనడా రాజధాని టొరంటో వెళ్తున్న ఒక విమానం రన్‌వేపై జారి ప్రమాదానికి గురైన ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఆరిజోనా రాష్ట్రంలో రెండు చిన్న విమానాలు ఢీకొన్న దృశ్యాలు