California: దక్షిణ కాలిఫోర్నియాలో విమాన ప్రమాదం.. ఇద్దరు మృతి, 18 మందికి గాయలు
ఈ వార్తాకథనం ఏంటి
విమాన ప్రమాదాలు వరుసగా కొనసాగుతున్నాయి. అమెరికా దక్షిణ కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఫులర్టన్ నగరంలో ఓ వాణిజ్య భవనంపై చిన్న విమానం కూలిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు.
ఈ ప్రమాదంలో 18 మంది గాయపడ్డారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఫులర్టన్ పోలీసులు వెల్లడించారు.
అమెరికా కాలమానం ప్రకారం జనవరి 2వ తేదీ మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది.
గాయపడిన 18 మందిలో ఎనిమిది మందిని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేసినట్లు చెప్పారు.
కూలిన విమానం ఒక సింగిల్ ఇంజిన్ విమానం అని ఫెడరల్ ఏవియేషన్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది.
ఈ విమానం కూలిన భవనంలో మంటలు చెలరేగిపోయాయి.
విమాన శకలాలు భవనంలోపల పడ్డట్లు అధికారులు పేర్కొన్నారు.
వివరాలు
దక్షిణ కొరియా, కజకిస్తాన్‌లలో భారీ విమాన ప్రమాదాలు
ఘటన తర్వాత ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలను సురక్షితమైన ప్రదేశాలకు తరలించారు.
ఇటీవలే దక్షిణ కొరియా, కజకిస్తాన్‌లలో భారీ విమాన ప్రమాదాలు జరిగాయి.
ఈ ప్రమాదాల్లో వందలాదిగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఇదే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా మరిన్ని పెద్ద విమాన ప్రమాదాలు తృటిలో తప్పినట్లు తెలుస్తోంది.