Page Loader
Israeli Embassy: అమెరికాలో ఉగ్రదాడి కలకలం.. వాషింగ్టన్‌ డీసీలో ఇజ్రాయెల్‌ ఎంబసీ సిబ్బందిపై కాల్పులు 
Israeli Embassy: వాషింగ్టన్‌ డీసీలో ఇజ్రాయెల్‌ ఎంబసీ సిబ్బందిపై కాల్పులు

Israeli Embassy: అమెరికాలో ఉగ్రదాడి కలకలం.. వాషింగ్టన్‌ డీసీలో ఇజ్రాయెల్‌ ఎంబసీ సిబ్బందిపై కాల్పులు 

వ్రాసిన వారు Sirish Praharaju
May 22, 2025
09:55 am

ఈ వార్తాకథనం ఏంటి

అగ్రరాజ్యం అమెరికాలో ఉగ్రదాడి తీవ్ర ఉద్రిక్తతను రేపింది. రాజధాని వాషింగ్టన్‌ డీసీలో ఉన్న ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయం (ఎంబసీ) సిబ్బందిపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో వారు కాల్పులు జరిపారు. దాంతో ఇద్దరు ఇజ్రాయెల్‌ ఎంబసీ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి అమెరికా హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టి నోయెమ్‌ వెల్లడించిన వివరాల ప్రకారం - బుధవారం సాయంత్రం కేపిటల్‌ జెవిష్‌ మ్యూజియం సమీపంలో ఈ దాడి జరిగింది. మ్యూజియంలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన ఇజ్రాయెల్‌ ఉద్యోగులు బయటకు రాగానే దుండగులు అతి సమీపానికి వచ్చి కాల్పులు జరిపారు. మృతుల్లో ఒక మహిళ కూడా ఉన్నట్లు సమాచారం.

వివరాలు 

భద్రతా వ్యవస్థపై ప్రశ్న

కాల్పుల అనంతరం ముష్కరులు "ఫ్రీ పాలస్తీనా" నినాదాలు చేసి అక్కడికక్కడే తీవ్ర ఉద్రిక్తతను నెలకొల్పారు. ఈ దాడిని ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయెల్‌ రాయబారి డానీ డానన్‌ తీవ్రంగా ఖండించారు. దాడిలో పాల్పడిన వారిపై అమెరికా ప్రభుత్వం కచ్చితంగా చర్యలు తీసుకుంటుందని తాము నమ్ముతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఘటన వాషింగ్టన్‌ డీసీలో చోటు చేసుకోవడం ప్రత్యేకంగా ఆందోళన కలిగిస్తోంది.ఎందుకంటే ఇదే నగరంలో అమెరికా అధ్యక్షుడు నివసిస్తారు. భద్రతా పరంగా అత్యంత కట్టుదిట్టంగా ఉండే ప్రాంతంలో ఇలాంటి ఉగ్రదాడి జరగడం అక్కడి భద్రతా వ్యవస్థపై ప్రశ్నల్ని లేవనెత్తుతోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వాషింగ్టన్‌ డీసీలో ఇజ్రాయెల్‌ ఎంబసీ సిబ్బందిపై కాల్పులు