Happy New Year 2025: కిరిబాతి, టోంగా దీవుల్లో మొదటిసారిగా 2025 వేడుకలు ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచం 2025కి స్వాగతం పలకడానికి సిద్ధమైంది. పసిఫిక్ మహా సముద్ర తీర ప్రాంత దేశాలు ప్రపంచంలోనే తొలిసారిగా కొత్త సంవత్సరం వేడుకలను జరుపుకుంటాయి.
భూమి సూర్యుడి చుట్టూ తిరిగే క్రమంలో సూర్యకిరణాలు ముందుగా ఈ ప్రాంతాలనే స్పృశిస్తాయి. పసిఫిక్ మహా సముద్రంలోని చిన్న ద్వీప దేశం కిరిబాతి కొత్త సంవత్సరానికి తొలిసారిగా అడుగుపెట్టే దేశం.
కిరిబాతిలో అర్ధరాత్రి 12 గంటలైతే, ఇండియాలో మధ్యాహ్నం 3:30 అవుతుంది.
కిరిబాతితో పాటు టోంగా దీవుల్లోనూ ఒకేసారి నూతన సంవత్సర వేడుకలు మొదలవుతాయి.
న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో పసిఫిక్ దేశాల తర్వాత కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తాయి.
ఇక చివరిసారిగా నూతన సంవత్సరంలో అడుగు పెట్టేది హౌలాండ్ అండ్ బేకర్ ఐలండ్స్, ఇవి భూగోళపు అంచుల్లో ఉంటాయి.
Details
ఇండియన్ స్టాండర్డ్ టైమ్ ప్రకారం కొత్త ఏడాది వేడుకలు
మధ్యాహ్నం 3:30 గంటలకు: కిరిబాతి, టోంగా, న్యూజిలాండ్
సాయంత్రం 6:30 గంటలకు: ఆస్ట్రేలియా
రాత్రి 8:30 గంటలకు: జపాన్, దక్షిణకొరియా
రాత్రి 9:30 గంటలకు: చైనా, ఫిలిప్పీన్స్
అర్ధరాత్రి 12:00 గంటలకు: భారత్, శ్రీలంక
తెల్లవారు జామున 4:30-5:30 గంటలకు: యూరప్ దేశాలు
ఉదయం 7:30-10:30 గంటల మధ్య: దక్షిణ అమెరికా ప్రాంతాలు
ఉదయం 10:30-1:30 గంటల వరకు: అమెరికా ప్రాంతాలు
సాయంత్రం 4:30-5:30 గంటలకు: అమెరికన్ సమోవా, హౌలాండ్ ఐలండ్స్