Page Loader
China: చైనాలో జనంపైకి దూసుకొచ్చిన కారు.. 35 మంది దుర్మరణం
చైనాలో జనంపైకి దూసుకొచ్చిన కారు.. 35 మంది దుర్మరణం

China: చైనాలో జనంపైకి దూసుకొచ్చిన కారు.. 35 మంది దుర్మరణం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 12, 2024
05:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

చైనాలో ఒక విపరీతమైన వేగంతో జన సమూహంపైకి దూసుకెళ్లిన కారు భారీ ప్రమాదాన్ని సృష్టించింది. ఈ ఘటనలో 35 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 43 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన నవంబర్ 11న, సోమవారం సాయంత్రం, దక్షిణ చైనాలోని జుహై నగరంలో చోటు చేసుకుంది. స్పోర్ట్స్ సెంటర్ వెలుపల ఉన్న జన సమూహంపైకి కారు వేగంగా దూసుకెళ్లిందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో 35 మంది మరణించగా, 43 మంది తీవ్రంగా గాయపడ్డారు.

వివరాలు 

సహాయక చర్యలు చేప్పట్టిన పోలీసులు 

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో అతను కత్తితో తనను తాను గాయపరుచుకుని ఆత్మహత్యయత్నం చేశాడు. వెంటనే పోలీసులు అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి కారణమైన 62 ఏళ్ల వ్యక్తి, తన భార్యతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్నాడని అధికారులు తెలిపారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ఈ ఘటనలో గాయపడిన పౌరులను ఆదుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రమాదం జరిగినప్పటి వీడియో