America: అమెరికాలో బీభత్సం సృష్టిస్తున్న వర్షాలు.. 9 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
అగ్ర రాజ్యం అమెరికాలో భారీ వర్షాలు దేశాన్ని వణికిస్తున్నాయి. భారీ తుఫాన్ల కారణంగా పలు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తాయి.
వాగులు, వంకలు పొంగిపొర్లాయి. బలమైన గాలులు వీచి, ఆస్తులు నాశనమయ్యాయి.
ఈ పరిస్థితి కారణంగా కెంటుకీలోనే అత్యధిక ప్రాణనష్టం జరిగింది. వరదలు ఇప్పటి వరకు 9 మంది ప్రాణాలను బలిగొన్నాయి.
నీటిలో చిక్కుకున్న కార్లలోని ప్రజలు మరణించారు. అదేవిధంగా, విద్యుత్ సరఫరా భారీగా అంతరాయం ఏర్పడింది.
సుమారు 39,000 ఇళ్లలో విద్యుత్ నిలిచిపోయింది.దీంతో అంధకారం అలుముకుంది. కెంటుకీ గవర్నర్ ఈ పరిస్థితి మరింత దిగజారే అవకాశం చెప్పారు.
వరదలు కారణంగా ప్రాణనష్టం సంభవించడం విషాదకరమని కెంటుకీ గవర్నర్ ఆండీ బెషీర్ అన్నారు.
వివరాలు
ప్రజలెవరూ రోడ్లపైకి రావొద్దు: గవర్నర్
ఈ సమయంలో వరదల్లో చిక్కుకున్న వందలాది మంది ప్రజలను రక్షించే చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
సహాయక చర్యలను సమన్వయం చేయడానికి ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీకి అనుమతులు ఇవ్వాలని నిర్ణయించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా వరదలపై సమీక్ష నిర్వహిస్తున్నారు.
ఏడేళ్ల బిడ్డతో సహా ఒక తల్లి కారు నీటిలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు.
ఈ నేపథ్యంలో ప్రజలెవరూ రోడ్లపైకి రావొద్దని గవర్నర్ కోరారు.
ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు. కెంటుకీ, టేనస్సీ ప్రాంతాల్లో 15 సెంటీమీటర్ల వర్షం కురిసిందని నేషనల్ వెదర్ సర్వీస్ సీనియర్ ఫోర్కాస్టర్ బాబ్ ఒరావెక్ చెప్పారు.
భారీ వరదలు వాగులు, వంకలను పొంగిపొర్లించేలా చేసాయి.