Page Loader
అమెరికా పార్లమెంట్ స్పీకర్‌ తొలగింపు.. 234ఏళ్ల యూఎస్ కాంగ్రెస్ చరిత్రలో ఇదే తొలిసారి 
అమెరికా పార్లమెంట్ స్పీకర్‌ తొలగింపు.. 234ఏళ్ల యూఎస్ కాంగ్రెస్ చరిత్రలో ఇదే తొలిసారి

అమెరికా పార్లమెంట్ స్పీకర్‌ తొలగింపు.. 234ఏళ్ల యూఎస్ కాంగ్రెస్ చరిత్రలో ఇదే తొలిసారి 

వ్రాసిన వారు Stalin
Oct 04, 2023
11:54 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా కాంగ్రెస్(పార్లమెంట్) మంగళవారం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. హౌస్ స్పీకర్‌ను పదవి నుంచి తొలగించింది. స్పీకర్ కెవిన్ మెక్‌కార్తీపై ఆయన సొంత రిపబ్లికన్ పార్టీ సభ్యులు ఆయనకు వ్యతిరేకంగా సభలో తీర్మానం చేశారు. ఈ తీర్మానంలో మెక్‌కార్తీకి మద్దతుగా 210 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 216ఓట్లు పోలయ్యాయి. ఈ నేపథ్యంలో కెవిన్ మెక్‌కార్తీ తన స్పీకర్ పదవిని వదులుకోవాల్సి వచ్చింది. 234ఏళ్ల అమెరికా చరిత్రలో స్పీకర్‌ను తొలగించడం ఇదే తొలిసారి. దీంతో అమెరికా కాంగ్రెస్‌లో అంతర్గత పోరు మరోసారి బయటపడింది. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది. మెక్‌కార్తీ స్థానంలో తాత్కాలిక స్పీకర్‌గా మరో ప్రతినిధి పాట్రిక్ మెక్‌హెన్రీ చేపట్టారు. పూర్తిస్థాయి స్పీకర్‌ను సభ త్వరలో ఎన్నుకోనుంది.

అమెరికా

మెక్‌కార్తీ నిర్ణయాలపై సొంత పార్టీ నాయకుల ఆగ్రహం

కెవిన్ మెక్‌కార్తీ కాంగ్రెస్‌లో రిపబ్లికన్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే మెక్‌కార్తీ అధికార డెమొక్రాట్‌ పార్టీకి అనుకూలంగా సభలో వ్యవహరిస్తున్నట్లు రిపబ్లికన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కెవిన్ మెక్‌కార్తీ కొన్ని నిర్ణయాలపై రిపబ్లికన్లు బహిరంగంగానే విమర్శించారు. ముఖ్యంగా షట్‌డౌన్‌ను నివారించడానికి తీసుకువచ్చిన తీర్మానాన్ని ఆమోదించడంలో మెక్‌కార్తీ పాత్ర కూడా ఉందని రిపబ్లికన్లు నమ్ముతున్నారు. ఈ తీర్మానం ఆమోదించకపోతే జో బైడెన్ ప్రభుత్వం చిక్కుల్లో పడేది. కానీ మెక్‌కార్తీ దానిని సభలో ఆమోదించారు. ఇది అతని పార్టీ రిపబ్లికన్లకు కోపం తెప్పించింది. గతంలో, అతను రుణ సంక్షోభాన్ని అధిగమించడంలో అధ్యక్షుడు జో బైడెన్‌కు కూడా మద్దతుగా కెవిన్ మెక్‌కార్తీ నిలిచారు.

అమెరికా

అక్టోబరు 11న కొత్త స్పీకర్‌పై ఓటింగ్! 

స్పీకర్ పదవి నుంచి తొలగించడాన్ని కొద్దిమంది మితవాద రిపబ్లికన్ రాడికల్స్ సమర్థించారు. స్పీకర్‌ను తొలగించే తీర్మానంపై ఓటింగ్ సందర్భంగా మెక్‌కార్తీని కాపాడాల్సిన సొంత పార్టీ డెమొక్రాట్‌లు రిపబ్లికన్‌లతో కలిసి స్పీకర్‌కు వ్యతిరేకంగా ఓటు వేశారు. అమెరికా కాంగ్రెస్‌లో ఇలా అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకే తీర్మానానికి ఓటు వేయడం చాలా అరుదుగా జరుగుతుంది. అక్టోబరు 11న కొత్త స్పీకర్‌పై ఓటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో కొత్త స్పీకర్ ఎన్నికపై చర్చించేందుకు తాము అక్టోబర్ 10న సమావేశం కావాలని రిపబ్లికన్‌లు యోచిస్తున్నారు.

అమెరికా

స్పీకర్ తొలగింపులో డొనాల్డ్ ట్రంప్ పాత్ర!

పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న మెక్‌కార్తీని సభ నుంచి తప్పించడం వెనుక మాజీ అధ్యక్షుడు, డెమొక్రాట్ నేత డొనాల్డ్ ట్రంప్‌ హస్తం కూడా ఉందనే చర్చ జరుగుతోంది. అమెరికా షట్‌డౌన్ బిల్లును వ్యతిరేకించమని సెనేట్, కాంగ్రెస్‌లోని తన మద్దతుదారులను ట్రంప్ ప్రేరేపించినట్లు ప్రచారం జరుగుతోంది. ట్రంప్ ఆదేశాలను పట్టించుకోకుండా స్పీకర్ మెక్‌కార్తీ బిల్లును ఆమోదించి, బైడైన్ రక్షించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ మెక్‌కార్తీ తొలగింపుకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మెక్‌కార్తీ జనవరి 7, 2023న స్పీకర్‌గా ఎన్నికయ్యారు. మొత్తం 269 రోజుల పాటు ఆయన హౌస్ స్పీకర్‌గా పనిచేశారు. అమెరికా చరిత్రలో ఏ స్పీకర్‌కైనా ఇది రెండో అతి తక్కువ పదవీకాలం.