Pakistan: పాకిస్థాన్‌లోని ఆర్మీ బేస్ పై ఆత్మాహుతి దాడి.. 23 మంది మృతి , 28 మందికి గాయాలు
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలోని డేరా ఇస్మాయిల్ ఖాన్‌లోని ఆర్మీ బేస్ పై ఉగ్రవాదుల బృందం దాడి చేసింది.
ఈ ఆత్మాహుతి దాడిలో కనీసం 23 మంది భద్రతా దళాల సిబ్బంది మరణించగా 28 మంది గాయపడ్డారు.
అనేక మంది ఆత్మాహుతి బాంబర్లు సెక్యూరిటీ కాంపౌండ్‌పైకి చొరబడి ప్రాంగణం లోపల పేల్చారు. ఉగ్రవాదులు భద్రతా సిబ్బందిపై కూడా కాల్పులు జరిపారు.
కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.
ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులోని గిరిజన ప్రాంతాలకు సమీపంలో జరిగిన ఈ దాడికి తామే బాధ్యులమని పాకిస్థాన్‌కు చెందిన టెహ్రీక్-ఏ-జిహాద్ పాకిస్థాన్ (TJP) ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పాకిస్థాన్‌లోని పోలీస్ స్టేషన్‌పై ఆత్మాహుతి దాడి
#BreakingNews
— KP Forum (@KPForum88) December 12, 2023
A group of militants stormed the gate of a local police station in #Draban area, Dera Islmail Khan district, Khyber Pakhtunkhwa.
Emergency declared, and security forces are on the scene.
Tehreek-e-Jihad Pakistan (TJP) has claimed the attack.
This is a… pic.twitter.com/7vBu3fcuu8