'హీరో కిమ్ కున్ ఓకే' అంటే ఏమిటి?.. అమెరికా నావికా శక్తిని ఎదుర్కోవడానికి ఉత్తర కొరియా కొత్త అణు జలాంతర్గామి
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తరకొరియా కొత్త వ్యూహాత్మక అణుదాడి జలాంతర్గామిని ప్రారంభించిందని ఉ.కొరియా న్యూస్ ఏజెన్సీ శుక్రవారం నివేదించింది.
ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ జలాంతర్గామి ప్రయోగ కార్యక్రమానికి హాజరైనట్లు వార్తా సంస్థ KCNA తెలిపింది.
సబ్‌మెరైన్-లాంచ్ వేడుక నార్త్ కొరియా అధికారిక డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా(DPRK) నావికా దళాన్ని బలోపేతం చేయడానికి కొత్త అధ్యాయానికి నాంది పలికింది.
ఈసందర్భంగా కిమ్ స్వయంగా సబ్‌మెరైన్‌ను పరిశీలిస్తున్న ఫొటోను కూడా విడుదల చేశారు.
సబ్‌మెరైన్ నుంచి అణ్వాయుధాలు కూడా ప్రయోగించవచ్చని న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ఈ కొత్త సబ్‌మెరైన్‌కు 'హీరో కిమ్ కున్-ఓకే' అనే పెట్టారు.
దీని హల్ నంబర్ 841.ఈ సబ్‌మెరైన్ నుండి రెండు వరుసల్లో 10 న్యూక్లియర్ బాలిస్టిక్ మిసైల్స్‌ను ప్రయోగించవచ్చు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అమెరికా నావికా శక్తిని ఎదుర్కోవడానికి ఉత్తర కొరియా కొత్త అణు జలాంతర్గామి
North Korea launches new tactical nuclear attack submarine https://t.co/shlfMo2WDF pic.twitter.com/0LwWgmsK9C
— Reuters World (@ReutersWorld) September 8, 2023