Israel Airstrike: హెజ్‌బొల్లాకు గట్టి ఎదురుదెబ్బ.. మరో కీలక నేత నబిక్ కౌక్ మృతి
లెబనాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ హెజ్‌బొల్లాకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఇజ్రాయెల్ ఆదివారం నిర్వహించిన వైమానిక దాడుల్లో హెజ్‌బొల్లా కీలక నేత నబిల్ కౌక్ మరణించారు. నబిల్ హెజ్‌బొల్లా సెంట్రల్ కౌన్సిల్‌లో డిప్యూటీ హెడ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే నబిల్ మృతిపై హెజ్‌బొల్లా నుండి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇటీవల కొన్ని వారాలుగా ఇజ్రాయెల్, లెబనాన్‌పై తీవ్ర దాడులు జరుపుతున్న విషయం తెలిసిందే.
హెజ్‌బొల్లా మిలటరీ కమాండర్‌గా పనిచేసిన నబిక్ కౌక్
హెజ్‌బొల్లా పలు సీనియర్ కమాండర్లను కోల్పోయింది. శుక్రవారం జరిగిన దాడిలో హెజ్‌బొల్లా అధినేత హసన్ నస్రల్లా (64) మృతి చెందడంతో ఈ సంఘటన గ్రూపునకు మరింత దెబ్బ తీసింది. నబిల్ కౌక్ 1995 నుండి 2010 వరకు సౌత్ లెబనాన్‌లో హెజ్‌బొల్లా మిలటరీ కమాండర్‌గా పనిచేశారు. 2020లో అమెరికా ఆయనపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.