
US Winter Strom: మంచు తుపాను ఎఫెక్ట్.. 2000 విమానాలు రద్దు.. ప్రయాణికుల అవస్థలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. తుపాను కారణంగా వేలాది విమానాలు రద్దయ్యాయి.
ఫలితంగా ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. మంచు తుపాను కారణంగా దాదాపు 2000 విమానాలు రద్దు కాగా.. 2400 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ చెబుతోంది.
మిడ్‌వెస్ట్, సౌత్ ప్రాంతాల్లో విమానాల రద్దు కారణంగా వందలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు.
చికాగో అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునే విమానాలలో దాదాపు 40 శాతం రద్దు ఫైట్స్‌ను రద్దు చేశారు.
అలాగే చికాగో మిడ్‌వే అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చే, ఇక్కడి నుంచి వెళ్లే మొత్త విమానాల్లో 60 శాతం రద్దు చేశారు.
అమెరికా
పెరిగిన విద్యుత్ కోతలు
డెన్వర్ ఇంటర్నేషనల్, మిల్వాకీ మిచెల్ ఇంటర్నేషనల్ విమానాశ్రయాలు మంచు తుపానుతో అత్యధికంగా ప్రభావితమయ్యాయి.
అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నిర్దేశించిన గ్రౌండింగ్ నియమాల ప్రకారం.. మంచు తుపాను కారణంగా ఈ వారంలో ప్రతిరోజూ 200 కంటే ఎక్కువ యునైటెడ్, అలాస్కా ఎయిర్‌లైన్స్ విమానాలు రద్దు చేశారు.
మంచు తుపాను వల్ల FlightAware కంపెనీకి చెందిన 400 విమానాలను రద్దు రద్దు అయ్యాయి.
మిగతా ఏ ఎయిర్‌లైన్ విమానాలు కూడా ఈ స్థాయిలో రద్దు కాలేదు. దీంతోపాటు మంచు తుపాను సృష్టిస్తున్న బీభత్సం వల్ల విద్యుత్ సరఫరాపై కూడా తీవ్ర ప్రభావం పడింది.
అమెరికా దక్షిణ ప్రాంతంలో విద్యుత్ కోతలు పెరిగాయి.