Page Loader
Donald Trump: డాలర్‌ ఆధిపత్యాన్ని అంగీకరించండి.. లేనిపక్షంలో 10శాతం సుంకాలు : ట్రంప్ హెచ్చరిక
డాలర్‌ ఆధిపత్యాన్ని అంగీకరించండి.. లేనిపక్షంలో 10శాతం సుంకాలు : ట్రంప్ హెచ్చరిక

Donald Trump: డాలర్‌ ఆధిపత్యాన్ని అంగీకరించండి.. లేనిపక్షంలో 10శాతం సుంకాలు : ట్రంప్ హెచ్చరిక

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 19, 2025
08:58 am

ఈ వార్తాకథనం ఏంటి

వాణిజ్య సుంకాల విషయంలో కఠిన వైఖరిని కొనసాగిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బ్రిక్స్‌ కూటమిపై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బ్రిక్స్‌ను 'ఒక చిన్న గ్రూప్‌"గా వ్యవహరించిన ఆయన, ఈ దేశాలు అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని సవాల్ చేస్తే 10 శాతం అదనపు సుంకాలు విధిస్తామని స్పష్టం చేశారు. ఇటీవల క్రిప్టో కరెన్సీ చట్టబద్ధతకు సంబంధించిన 'జీనియస్‌' బిల్లుపై సంతకం చేసిన ట్రంప్, ఆ తరువాత వైట్‌హౌస్ వద్ద మీడియాతో మాట్లాడుతూ... 'బ్రిక్స్‌ అనే ఓ చిన్న గ్రూప్‌ ఉంది. అది వేగంగా తన ప్రాధాన్యతను కోల్పోతోంది. వారిని మేం బలంగా ఎదుర్కొంటున్నాం. వారు డాలర్‌ గ్లోబల్ ప్రమాణాన్ని అటు తప్పించాలనుకుంటున్నారు. అందుకే వారిపై సుంకాలు పెంచుతున్నామని పేర్కొన్నారు.

Details

డాలర్ స్థాయిలో తేడా వచ్చినా మేం ఓటమిగా భావిస్తాం

'అమెరికా డాలర్‌కు గ్లోబల్ రిజర్వ్ కరెన్సీ హోదా ఉంది. దాని విలువ తగ్గడానికి మేం అనుమతించం. ఎవరు మాతో ఆడితే, తగిన ప్రతిస్పందన ఇస్తాం. డాలర్‌ స్థాయిలో తేడా వచ్చినా దాన్ని మేం ఓటమిగా భావిస్తామని ట్రంప్ తన ధృడతను వ్యక్తం చేశారు. బ్రిక్స్‌ కూటమిలో ప్రాథమికంగా బ్రెజిల్, రష్యా,ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాలుండగా, ఇటీవల ఇరాన్‌, ఇథియోపియా, ఈజిప్ట్‌, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌, ఇండోనేసియా వంటి దేశాలు కూడా ఇందులో చేరాయి. ఈ దేశాల సమ్మేళనాన్ని ఇప్పుడు'బ్రిక్స్‌ ప్లస్‌'గా పిలుస్తున్నారు. ఇటీవల జరిగిన బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సులో ట్రంప్ ప్రవేశపెట్టిన ఏకపక్ష టారిఫ్ విధానంపై ఈ దేశాలు గట్టి వ్యతిరేకత వ్యక్తం చేయగా, దానికి స్పందనగా ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.