Page Loader
అంతా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ మహిమ.. ముద్దుగా కనిపిస్తున్న ప్రపంచ దేశాధినేతలు
ముద్దుగా మారిన అంతర్జాతీయ ప్రముఖులు

అంతా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ మహిమ.. ముద్దుగా కనిపిస్తున్న ప్రపంచ దేశాధినేతలు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 10, 2023
06:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏఐ టెక్నిక్స్ అంటే ఇప్పుడు తెలియని వారుండరేమో. అంతలా నెట్టింట చొచ్చుకెళ్లిందిది. ప్రపంచ దేశాధినేతలు, అంతర్జాతీయంగా అత్యంత ప్రభావం చూపిన నాయకులు, అగ్రశ్రేణి క్రీడాకారులు, ఇతర రంగాల ప్రముఖులు చిన్నతనంలో ఎలా ఉండేవారో ఎవరికీ తెలియదు. అందుకే కాబోలు. వీళ్లకు సంబంధించిన చిత్రాలను ఏఐ ఆర్టిస్ట్‌ జాన్ ముల్లర్ కళ్లకు కట్టినట్టు ప్రపంచానికి పరిచయం చేశారు. అర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అద్భుతాలు అన్నీఇన్నీ కావు. ఇది టెక్నాలజీని కొంత పుంతలు తొక్కిస్తోంది. టెక్‌ రంగంలోనే కాదు, ఆర్టిస్ట్‌ల ఊహా శక్తికీ ఏఐ అద్దం పడుతోంది. కృత్రిమ మేథ సహకారంతో ఇప్పటికే సృష్టించిన పలు చిత్రాలు, వీడియోలు నెటిజన్లను ఉర్రూతలూగిస్తుండటం విశేషం.

ఏఐ 

ఏఐ టెక్నిక్స్ తో ప్రపంచ దేశాధినేతల నయా లుక్

కృత్రిమ మేథస్సు ( ఏఐ టెక్నిక్స్ ) వాడితే వివిధ దేశాలనే ఏలుతున్న అధ్యక్షులు, ప్రధానులు చిన్నతనంలో ఎలా ఉండేవారో దీని సాయంతో చూడగలుగుతున్నాం. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్‌, రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్‌ పుతిన్‌, కెనడా ప్రెసిడెంట్ జస్టిన్‌ ట్రూడో, ఉత్తర కొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, బ్రిటన్‌ మాజీ ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్సన్‌ సహా పలువురు నేతలు బుజ్జాయిల్లాగా గమ్మత్తుగా మారిపోయారు. ప్రస్తుతం బేబీస్ లాగా, చిన్నారుల్లాగా రూపాంతరం చెందిన వివిధ దేశాధినేతల చిత్రాలు ట్విట్టర్, ఇన్స్ స్టాలో సందడి చేస్తున్నాయి.