Page Loader
'టైటాన్' మినీ సబ్‌మెరిన్‌‌లో ఉన్న ఐదుగురు జలసమాధి: యూఎస్ కోస్ట్ గార్డ్ 
'టైటాన్' మినీ సబ్‌మెరిన్‌‌లో ఉన్న ఐదుగురు జలసమాధి: యూఎస్ కోస్ట్ గార్డ్

'టైటాన్' మినీ సబ్‌మెరిన్‌‌లో ఉన్న ఐదుగురు జలసమాధి: యూఎస్ కోస్ట్ గార్డ్ 

వ్రాసిన వారు Stalin
Jun 23, 2023
10:32 am

ఈ వార్తాకథనం ఏంటి

అట్లాంటిక్ మహాసముద్రంలో చారిత్రక టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు ఐదుగురు యాత్రికులతో వెళ్తున్న టూరిస్ట్ సబ్‌మెర్సిబుల్ 'టైటాన్' మినీ సబ్‌మెరిన్ పేలిపోయినట్లు యూఎస్ కోస్ట్ గార్డ్ ధృవీకరించారు. అందులో ఉన్న ఐదుగురు జలసమాధి అయినట్లు పేర్కొన్నారు. టైటానిక్ నౌక శిథిలాలకు సమారు 1,600ఫీట్ల దూరంలోనే సబ్‌మెర్సిబుల్ భాగాలు భాగాలను కనుగొన్నట్లు యూఎస్ కోస్ట్ గార్డ్ వెల్లడించారు. కెనడియన్ షిప్ ద్వారా మోహరించిన రోబోటిక్ డైవింగ్ వాహనం సాయంతో 'టైటాన్' జాడలను కనుగొన్నారు. సబ్‌లో ఉన్నవారిలో ఓషన్‌గేట్ సీఈఓ స్టాక్‌టన్ రష్, బ్రిటిష్-పాకిస్థానీ వ్యాపారవేత్త షాజాదా దావూద్, అతని కుమారుడు సులేమాన్, బ్రిటిష్ వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్, ఐదో వ్యక్తి 77ఏళ్ల ఫ్రెంచ్ మాజీ నేవీ డైవర్, ప్రఖ్యాత అన్వేషకుడు పాల్-హెన్రీ నార్గోలెట్ ఉన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 రోబోటిక్ డైవింగ్ సాయంతో టైటాన్ జాడలు