USA: అమెరికా ఇక తగ్గేదే లే.. యూఎస్ కాంగ్రెస్‌లో ట్రంప్ తొలిప్రసంగం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టిన రెండున్నర నెలలు పూర్తి అవుతోంది ఈ వ్యవధిలోనే ఆయన దాదాపు 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేసి, వాటిని అమల్లోకి తీసుకువచ్చారు.
ఈ నేపథ్యంలో, ట్రంప్ యూఎస్ కాంగ్రెస్‌లో ప్రసంగించారు. నవంబర్ ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి, పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కాంగ్రెస్‌లో ఆయన మాట్లాడటం ఇదే తొలిసారి.
తన అధ్యక్ష పదవీ కాలంలో ఇప్పటివరకు చేసిన పనులు, సాధించిన విజయాల గురించి వివరించారు.
గతంలో అమెరికా నాలుగేళ్లు, ఎనిమిదేళ్లలో సాధించిందానికంటే ఎక్కువగా తాను 43 రోజుల్లోనే సాధించానని పేర్కొన్నారు. ఇది కేవలం ప్రారంభమని, ఇకపై అమెరికా ఎక్కడా తగ్గదని స్పష్టం చేశారు.
Details
అగ్రరాజ్య స్థాయిని నిలబెట్టడమే ముఖ్య లక్ష్యం
తన అధ్యక్ష పదవీకి ముందుగా అమెరికా తీవ్ర ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొన్నట్లు ట్రంప్ అన్నారు. గత 48 ఏళ్లలో ఇదే అతిపెద్ద ఆర్థిక నష్టంగా పేర్కొన్నారు.
ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడమే తన ప్రధాన లక్ష్యమని చెప్పారు. అమెరికా మళ్లీ మునుపటి స్థాయికి చేరుకుందని, అమెరికన్ ప్రజల కలలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నానని చెప్పారు.
ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు తాను తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
ఎలాన్ మస్క్‌పై ప్రశంసలు
అమెరికాలో అక్రమ వలసలను అరికట్టేందుకు ప్రభుత్వం చురుగ్గా పనిచేస్తోందని ట్రంప్ తెలిపారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ పనితీరుకు పూర్తి మద్దతుగా నిలిచిన ఎలాన్ మస్క్‌ను పొగడ్తల్లో ముంచెత్తారు.
మస్క్ చాలా కష్టపడి పనిచేస్తున్నారని, ఆయన నాయకత్వం అద్భుతమని పేర్కొన్నారు.
Details
ఏప్రిల్ 2 నుంచి కొత్త పరస్పర సుంకాలు
సుంకాల వ్యవహారంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇతర దేశాలపై ఏప్రిల్ 2 నుంచి కొత్త సుంకాలు అమల్లోకి వస్తాయని ప్రకటించారు.
కొన్ని దశాబ్దాలుగా ఇతర దేశాలు అమెరికాపై అధిక సుంకాలు విధిస్తున్నాయని, అమెరికా మాత్రం తక్కువ వసూలు చేస్తోందని తెలిపారు.
భారత్ ఆటోమొబైల్ ఉత్పత్తులపై 100%కి పైగా సుంకాలు విధిస్తోందని, ఇది అమెరికాకు అన్యాయం అని పేర్కొన్నారు.
అందుకే ఏప్రిల్ 2 నుంచి పరస్పర సుంకాలు అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఇతర దేశాలు ఎంత సుంకం విధిస్తే, అమెరికా కూడా అదే స్థాయిలో విధిస్తుందని తేల్చిచెప్పారు.