భారత్ రక్షణకు అమెరికా కీలక సహకారం.. స్ట్రైకర్ ఆర్మర్డ్ వాహనాలకు గ్రీన్ సిగ్నల్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం వాషింగ్టన్‌లో అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్‌తో కీలక సమావేశంలో పాల్గొన్నారు. ఈ మేరకు భారతదేశానికి యూఎస్ రక్షణ సహకారం అందించనుంది.
ఈ నేపథ్యంలోనే పెంటగాన్ న్యూదిల్లీకి అధునాతన ఆయుధాలు, ఆర్మర్డ్ వెహికిల్స్ సహా లేటెస్ట్ డిఫెన్స్ టెక్నాలజీని అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.
స్ట్రైకర్ ఆర్మర్డ్ వాహనాలు, హూవిట్టజర్ ఎంక్యూ-9 రీపర్ డ్రోన్లను అందించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవే కాకుండా M777 గన్ అప్ గ్రేడ్, MQ-9 రీపర్ డ్రోన్లు, GE-F 414 ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్‌ల తయారీకి సంబంధించిన టెక్నాలజీని సైతం భారత్ కు అందించనుంది.
DETAILS
155 MM, M777 మోడల్ హూవిట్జర్ల అందించేందుకు గ్రీన్ సిగ్నల్
భారతదేశంలో 2.7 బిలియన్ డాలర్లతో చిప్ ప్లాంట్ నిర్మాణం కోసం మైక్రోన్ కంపెనీతో ఒప్పందం, క్వాంటం కంప్యూటింగ్, ఏఐపై ఒప్పందాలు ముఖ్యపాత్ర పోషించనున్నాయి.
అమెరికా పర్యటనలో భారత్ డ్రోన్‌ల కొనుగోలుకూ మార్గం సుగమమైంది. కీలకమైన స్ట్రైకర్ ఆర్మర్డ్ 8 చక్రాల సాయుధ వాహనాన్ని ఆఫ్ఘన్ లోని తాలిబాన్‌లపై అమెరికన్ సైన్యం ప్రయోగించింది.
ఈ వాహనం సాయంతో కొండ కోనల్లోని లక్ష్యాలపైనా దాడి చేయగలగవచ్చు. జనరల్ డైనమిక్స్ ల్యాండ్ సిస్టమ్స్ దీన్ని తయారు చేస్తోంది.
ఉత్తర భారతదేశంలో ఫిరంగుల నుంచి ఎదురయ్యే సవాళ్లను నిలువరించేందుకు యూఎస్ గైడెడ్ లాంగ్ రేంజ్ మందుగుండు సామగ్రి 155 MM, M777 మోడల్ హూవిట్జర్ల అందించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
DETAILS
చైనాకు చెక్ చెప్పేందుకు హంటర్-కిల్లర్ రీపర్ డ్రోన్‌ల సహకారం
ఇక సైబర్ సెక్యూరిటీపై భారత్, యూఎస్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఫలితంగా 2 దేశాల సంబంధాలు మరింత బలపడనున్నాయి.
చైనా నుంచి భారతదేశం నిత్యం సవాళ్లు ఎదుర్కొంటున్న క్రమంలో హంటర్-కిల్లర్ రీపర్ డ్రోన్‌ల కొనుగోలుకు అతిపెద్ద ఒప్పందం జరిగే అవకాశం ఉంది.
రానున్న 10 ఏళ్లలో దేశీయంగా తయారైన యుద్ధ విమానాలకు శక్తినిచ్చే F-414 ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్లు సహా సాయుధ డ్రోన్‌లను కొనుగోలు చేసేందుకు ఒప్పందాలు జరిగేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.
ప్రధానమంత్రి మోదీ, యూఎస్ పర్యటనలో భాగంగా రక్షణ, అత్యాధునిక సాంకేతిక సహకారంపై పలు కీలక ఒప్పందాలు జరగనున్నాయి. మరోవైపు ఆర్థిక పెట్టుబడులు, ప్రజల మధ్య మెరుగైన సంబంధాలను అందిస్తుందని అధికార వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.