అమెరికాలో ప్రధాని మోదీ.. విసా నిబంధనలపై నేడు యూఎస్ కీలక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో భారతదేశం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నేడు ఎన్నారైలకు శుభవార్త వెలువడనున్నట్లు సమాచారం.
ఈ మేరకు త్వరలోనే భారతీయుల వీసా కష్టాలు మాయం కానున్నాయి. హెచ్-1బీ వీసా రెన్యూవల్ ను మరింత సులభతరం చేసేందుకు యూఎస్ ప్రభుత్వం నిర్ణయించిందని అధికార వర్గాలు అంటున్నాయి.
ఇందులో భాగంగా వీసాల పునరుద్ధరణకు స్వదేశాలకి వెళ్లాల్సిన అవసరం లేకుండా అతిథ్య దేశంలోనే ఆయా సేవలు పొందే అవకాశాన్ని కల్పించనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
ఈ క్రమంలో తొందరలోనే ఓ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
DETAILS
హెచ్1బీ వీసాలపై నేడు అమెరికా సర్కార్ కీలక నిర్ణయం వెలువరించే అవకాశం
తొలి విడత పైలట్ ప్రాజెక్టులో తొలుత కొంత మంది విదేశీయులకే ఈ అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. దీనిపై ఇవాళ అమెరికా సర్కార్ కీలక ప్రకటన జారీ చేసే అవకాశం ఉంది.
గ్రీన్ కార్డు, హెచ్ 1బీకి సంబంధించిన నియమ నిబంధనలపై యూఎస్ ప్రభుత్వం ఇప్పటికే కీలక విధానపరమైన నిర్ణయాన్ని తీసుకుందని సమాాచారం.
హెచ్-1బీ వీసాదారుల్లో అత్యధిక సంఖ్యలో భారతీయులే ఉన్నారన్న అంశం తెలిసిందే. అయితే గతేడాది జారీ చేసిన 4.42 లక్షల హెచ్-1బీ వీసాల్లో ఎక్కువగా ఇండియన్సే సాధించుకున్నారు. ఈ మేరకు 73 శాతం వీసాలను భారతీయులే పొందడం గమనార్హం.
భారతీయులు సహా విదేశీ నిపుణలు అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకునేందుకు సులభ విధానాలను ప్రకటించనున్నట్లు తెలుస్తుంది.