
జిన్‌పింగ్ ఓ నియంత: చైనా అధ్యక్షుడిపై బైడెన్ సంచలన వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 'నియంత'గా అభివర్ణించారు. ఈ ఏడాది ప్రారంభంలో యూఎస్ గగనతలంపై బెలూన్‌ను ఎగరేయడంపై బైడెన్ మండిపడ్డారు.
బైడెన్ కాలిఫోర్నియాలో నిధుల సేకరణలో భాగంగా మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన చైనాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నంలో యూఎస్ విదేశాంగ మంత్రి ఆంథోనీ బ్లింకెన్ చైనాలో పర్యటిస్తున్న నేపథ్యంలో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నది.
బ్లింకెన్ చైనా పర్యటనతో ఇరుదేశాల మధ్య సంబధాలు మెరుగుపడ్డాయని సోమవారం వ్యాఖ్యానించిన బైడెన్, మరుసటి రోజే జిన్‌పింగ్‌ను నియంతగా అభివర్ణించడం గమనార్హం.
అమెరికా
జీ20 సమావేశంలో బైడెన్- జిన్‌పింగ్ కలిసే అవకాశం
ఇదిలా ఉంటే, సెప్టెంబరులో భారతదేశంలో జీ20 సమావేశం జరగనుంది. అలాగే నవంబర్‌లో ఏపీఈసీ సమ్మిట్ నిర్వహించనున్నారు. ఈ రెండు ఈవెంట్లలో సమావేశాల్లో బైడెన్, జిన్‌పింగ్ సమావేశం అయ్యే అవకాశం ఉంది.
తైవాన్‌పై చైనా ఉక్కుపాదం, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, చైనా చిప్ పరిశ్రమకు వ్యతిరేకంగా అమెరికా తీసుకున్న చర్యలతో సహా రెండు దేశాల మధ్య గ్యాప్ చాలా పెరిగిపోయింది.
మరోవైపు భారత ప్రధాని నరేంద్ర మోదీకి జూన్ 22న వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధికారిక విందును ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో భారత్ - అమెరికా మధ్య సంబంధాలు మరింత బలపడుతున్న నేపథ్యంలో చైనా అది జీర్ణించుకోలేకపోతోంది.