వైట్‌హౌస్‌లో మోదీకి బైడెన్ దంపతుల విందు; యూఎస్ అధ్యక్షుడి ఆతిథ్యానికి ప్రధాని ఫిదా
ప్రధాని నరేంద్ర మోదీ తన రెండోరోజు అమెరికా పర్యటనలో భాగంగా బుధవారం జో బైడెన్ దంపతులు వైట్‌హౌస్‌లో ఇచ్చిన అధికారిక ప్రైవేట్ డిన్నర్‌కు హాజరయ్యారు. మొదట వాషింగ్టన్‌లోని ఆండ్రూస్ ఎయిర్ బేస్‌కు చేరుకున్న మోదీకి అమెరికా అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరు దేశాల జాతీయ గీతాలను ఆలపించారు. వాషింగ్టన్ డీసీకి చేరుకున్న మోదీకి ఫ్రీడమ్ ప్లాజా వద్ద భారతీయులు స్వాగతం పలికారు. కొంతమంది ప్రవాసులు ప్రధాని బసచేసే హోటల్ వెలుపల 'గర్బా', ఇతర జానపద నృత్యాలతో సహా సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. తొలుత మోదీ అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్‌తో కలిసి నేషనల్ సైన్స్ ఫౌండేషన్‌ను సందర్శించారు.
యూఎన్‌లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించిన యోగా డే
ప్రధాని మోదీకి స్టేట్ డిన్నర్‌కు ముందు వడ్డించే వంటకాలను ప్రదర్శనలో ఉంచారు. మెనూలో మిల్లెట్, స్టఫ్డ్ మష్రూమ్‌లు సహా వివిధ భారతీయ వంటకాల వెజ్ వెరైటీలు ఉన్నాయి. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీకి బైడెన్ దంపతులు వైట్‌హౌస్‌లో ప్రైవేట్‌గా విందు ఇచ్చారు. డైనింగ్ టేబుల్‌ను కుంకుమ-రంగు పూలతో తామర పువ్వులతో అంకరించి, విందుకు భారతీయ టచ్ ఉండేలా ఏర్పాట్లు చేశారు. మోదీ రాక నేపథ్యంలో వైట్‌హౌస్‌ను నెమళ్లు, తామర పువ్వులతో అలంకరించారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సంగీతాన్ని మోదీ కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. వైట్‌హౌస్‌లో అడుగడుగున లభించిన ఆదరణను చూసి మోదీ ఫిదా అయ్యారు. ఇదిలా ఉంటే, గురువారం(అమెరికా కాలామానం ప్రకారం) ప్రధాని మోదీ యూఎస్ సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తారు.