అమెరికా: ట్రంప్-రష్యా వ్యవహారంలో ఎఫ్‌బీఐ ఆరోపణలను తప్పబట్టిన ప్రాసిక్యూటర్
2016 అమెరికాలో ఎన్నికల ప్రచారం సమయంలో అప్పటి అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ -రష్యా కుమ్మక్కైనట్లు ఎఫ్‌బీఐ చేసిన ఆరోపణలపై అమెరికా స్పెషల్ ప్రాసిక్యూటర్ న్యాయవాది జాన్ డర్హామ్ తన నాలుగేళ్ల విచారణను ముగించారు. అమెరికాలో ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందన్న ఎఫ్‌బీఐ ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాధారాల లోపభూయిష్టంగా ఉన్నాయని జాన్ డర్హామ్ తన నివేదికలో చెప్పారు. ట్రంప్ -రష్యా వ్యవహారాన్ని తేల్చడానికి అటార్నీ జనరల్ బిల్ బార్ ఆధ్వర్యంలో ప్రత్యేక న్యాయవాది జాన్ డర్హమ్‌తో విచారణ చేపట్టాలని 2019లో అప్పటి అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించారు. దాదాపు 300 కంటే ఎక్కువ పేజీలతో డర్హామ్ తన నివేదికను రూపొందించారు. జో బిడెన్ అధ్యక్షుడు అయ్యాక కూడా విచారణ కొనసాగింది.
డర్హామ్ నివేదికను స్వాగతించిన ట్రంప్
అమెరికా లా ఎన్‌ఫోర్స్‌మెంట్, ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ క్రాస్‌ఫైర్ హరికేన్ విచారణ ప్రారంభంలో వారి హోల్డింగ్‌లలో రష్యా-ట్రంప్ కుట్రకు సంబంధించిన వాస్తవ సాక్ష్యాధారాలను కలిగి ఉన్నట్లు కనిపించడం లేదని డర్హామ్ తన నివేదికలో పేర్కొన్నారు. 2016లో ట్రంప్ ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్‌పై విచారణ జరిపిన విధానంలో ఎఫ్‌బీఐ, న్యాయ శాఖ ద్వంద్వ ప్రమాణాన్ని ప్రదర్శించాయని డర్హామ్ అన్నారు. 2024లో రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని కోరుతున్న ట్రంప్, తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫారమ్ ద్వారా డర్హామ్ నివేదికను స్వాగతించారు.