
Blinken : పన్నన్ హత్య కుట్రపై భారత ఉద్యోగి పాత్ర.. సీరియస్'గా తీసుకుంటున్నామన్న బ్లింకెన్
ఈ వార్తాకథనం ఏంటి
ఖలీస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్య కుట్రపై అమెరికా స్పందించింది.
ఈ మేరకు భారత ప్రభుత్వ ఉద్యోగి పాత్రను సీరియస్'గా తీసుకుంటున్నామని US సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ వెల్లడించారు.
అమెరికా గడ్డపై ఖలిస్థానీ ఉగ్రవాదిని హతమార్చేందుకు విఫలమైన కుట్రలో భాగంగా భారత అధికారి ప్రమేయం ఉన్నారని అమెరికా చేసిన ఆరోపణలపై ఇప్పటికే భారత్ విచారణకు సిద్ధమని ప్రకటించింది.
ఈ నేపథ్యంలోనే అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ ఈ చర్యను స్వాగతించారు. ఇది మంచి పరిణామని, సముచితమైనదని చెప్పారు.
ఇదే సమయంలో అమెరికా గడ్డపై న్నూన్‌ను హత్య అంశాన్ని వాషింగ్టన్ "చాలా తీవ్రంగా" తీసుకుంటుందన్నారు.
ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌లో ఉన్న బ్లింకెన్, న్యాయపరిధిలో ఉన్న అంశంపై వివరంగా చెప్పలేనన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
హత్యకు జరిగిన కుట్రపై భారత్ విచారణను స్వాగతిస్తున్నాం : బ్లింకెన్
BLINKEN ON INDICTMENT: Secretary of State Antony Blinken confirmed he spoke with Indian officials about the murder for hire plot against Sikhs for Justice’s Gurpatwant Singh Pannun, that has come to light involving Indian national, Nikhil Gupta, who is now in custody.#Khalistan… pic.twitter.com/oL5rQpbIqu
— Diya TV (@DiyaTV) December 1, 2023