చైనాపై అమెరికా ఆంక్షలు.. సాంకేతిక పెట్టుబడులపై నిషేధాజ్ఞలు
అగ్రరాజ్యం అమెరికా చైనాపై కన్నెర్ర చేస్తోంది. ఈ మేరకు డ్రాగన్ దేశంపై తాజాగా మరిన్ని ఆంక్షలు విధించింది. చైనాకు చెందిన సాంకేతిక పరిశ్రమల్లో అమెరికన్ పెట్టుబడులను నియంత్రించేందుకు ఆగ్రదేశం నడుంబిగించింది. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. చైనాలోని హైటెక్ టెక్నాలజీ పరిశ్రమల్లో(ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్) అమెరికన్ ఇన్వెస్ట్ మెంట్లను నియంత్రించేందుకు అగ్రరాజ్యాధిపతి జో బిడెన్ కార్యనిర్వహక ఆదేశాలను జారీ చేశారు. అమెరికా తాజా నిర్ణయంతో ప్రపంచంలోనే తొలి రెండు అగ్రదేశాలుగా పేరొందిన యూఎస్, చైనా ఆర్థిక వ్యవస్థల మధ్య సంబంధాలు బలహీనం కానుంది.
చైనీస్ కంపెనీలు చాట్‌జీపీటీకి గట్టి పోటీ ఇవ్వగలవు
చైనాలో అధునాతన సెమీ కండక్టర్లు, క్వాంటం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (INFORMATION TECHNOLOGY), కొత్త ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్, జాయింట్ వెంచర్స్ లాంటి వాటికి సంబంధించిన పెట్టుబడులను తాజాగా అమెరికా నిషేధించింది. వాషింగ్టన్ - బీజింగ్ సంబంధాలను బలపర్చుకునే లక్ష్యంతో యూఎస్ ఉన్నతాధికారులు ఇటీవలే చైనాలో పర్యటించారు. అనంతరం కాసేపటకే తాజాగా ఆంక్షలు అమల్లోకి రావడం గమనార్హం. ప్రత్యేకత సాంకేతికత చైనాకు అందకుండా అమెరికా ఆంక్షలను కొనసాగిస్తోంది. ఈ మేరకు చైనాలోని ఏఐ ఇండస్ట్రీ ప్రభావితం కానుంది. అధిక పనితీరు, సామర్థ్యం గల కంప్యూటర్ చిప్‌లు, సెమీ కండక్టర్ల అంశంపై నువ్వా నేనా అన్నట్లు రెండు దేశాలు దూసుకెళ్తున్నాయి. ఎగుమతులపై ఆంక్షలతో చైనీస్ కంపెనీలు చాట్‌జీపీటీకి గట్టి పోటీ ఇవ్వగలవని చైనా భావిస్తోంది.