
Brics Summit: బ్రిక్స్ సమ్మిట్ వేళ, రష్యా విదేశాంగ మంత్రిత్వశాఖపై భారీ సైబర్ దాడులు..!
ఈ వార్తాకథనం ఏంటి
రష్యాలోని కజన్ వేదికగా బ్రిక్స్ దేశాల 16వ శిఖరాగ్ర సదస్సు జరుగుతోంది. బుధవారం ఈ సదస్సు జరుగుతున్న సమయంలో, రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖపై సైబర్ దాడులు జరిగినట్లు అధికార ప్రతినిధి మరియా జఖరోవా తెలిపారు.
"బ్రిక్స్ సదస్సు జరుగుతున్న సమయంలో, రష్యా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికారిక వెబ్‌సైట్‌పై విస్తృతంగా సైబర్ దాడులు జరిగాయి. మంత్రిత్వశాఖ సేవలను దెబ్బతీసే విధంగా 'డీడీఓఎస్' దాడులు జరిగినట్లు గుర్తించాం. మంత్రిత్వశాఖ తరచూ ఇలాంటి దాడులను ఎదుర్కొంటున్నప్పటికీ, తాజా దాడులు చాలా తీవ్రంగా ఉన్నాయి" అని ఆమె చెప్పారు.
వివరాలు
దౌత్యం, చర్చలకు భారత్ మద్దతు
ఇదిలా ఉండగా, ఈ సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తదితర దేశాధినేతలు హాజరయ్యారు.
సదస్సులో ప్రసంగించిన మోదీ, దౌత్యం, చర్చలకు భారత్ మద్దతు తెలుపుతుందని, యుద్ధానికి మాత్రం వ్యతిరేకమని పునరుద్ఘాటించారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా పరిస్థితులు, ఉగ్రవాదం వంటి అంశాలపై ఆందోళన వ్యక్తం చేశారు.
మరోవైపు, ఈ కూటమిలో చేరేందుకు 30 దేశాలు ఆసక్తి చూపుతున్నాయని పుతిన్ తెలిపారు.
భారత ఆర్థిక వృద్ధిపై ప్రసంసలు కురిపిస్తూ, బ్రిక్స్ దేశాలకు భారత్ ఒక ఆదర్శంగా నిలుస్తుందని ఆయన అన్నారు.