LOADING...
London: లండన్‌లోని ఇస్కాన్ రెస్టారెంట్‌లోకి చికెన్ తెచ్చిన యువకుడు.. 
లండన్‌లోని ఇస్కాన్ రెస్టారెంట్‌లోకి చికెన్ తెచ్చిన యువకుడు..

London: లండన్‌లోని ఇస్కాన్ రెస్టారెంట్‌లోకి చికెన్ తెచ్చిన యువకుడు.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 21, 2025
12:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇస్కాన్ ఆలయాలను కృష్ణ భక్తులు అత్యంత పవిత్రమైనవి అనే భావనతో గౌరవిస్తారు. ఈ ఆలయాల్లో ప్రతిరోజూ పూజలు, భజనలు నిర్వహించబడుతూ ఉంటాయి. ఇక్కడికి వచ్చేవారు ఆలయంలో ఏర్పడే ఆధ్యాత్మిక వాతావరణానికి ఆకర్షితులవుతుంటారు. అందుకే ఇస్కాన్ ఆలయాన్ని ప్రశాంతతకు ప్రతీకగా పేర్కొంటారు. అయితే తాజాగా ఒక ఇస్కాన్ ఆలయంలో ఈ ప్రశాంత వాతావరణాన్ని భంగపరిచే సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాలు 

లండన్‌లోని ఇస్కాన్ గోవింద రెస్టారెంట్‌లో ఘటన 

ఈ సంఘటన లండన్‌లోని ఇస్కాన్ గోవింద రెస్టారెంట్‌లో జరిగింది. ఆఫ్రికన్ వంశానికి చెందిన ఒక యువకుడు తన చేతిలో కేఎఫ్‌సీ చికెన్ బాక్స్‌ పట్టుకొని ఆ ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించి అక్కడే దాన్ని తినడం ప్రారంభించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఎవరో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ అయ్యింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు అతడి చర్యను ఉద్దేశపూర్వకంగా, ఇతరులను రెచ్చగొట్టే విధంగా చేసింది అని అభిప్రాయపడుతున్నారు. వైరల్ వీడియోలో ఆ యువకుడు గోవింద రెస్టారెంట్ కౌంటర్ దగ్గరికి వెళ్లి అక్కడి సిబ్బందిని 'ఇక్కడ మాంసాహారం ఉందా?' అని అడుగుతున్నట్టు కనిపిస్తుంది.

వివరాలు 

అక్కడి సిబ్బందితో వాగ్వివాదం 

అయితే ఆ రెస్టారెంట్‌లో కేవలం శాఖాహార వంటకాలు మాత్రమే అందిస్తారని తెలిసిన తరువాత, అతడు తన దగ్గరున్న కేఎఫ్‌సీ బాక్స్‌ను ఓపెన్ చేసి చికెన్ తీసి కౌంటర్ వద్దే తినడం మొదలుపెట్టాడు. తర్వాత అతడు తన చేతిలో ఉన్న చికెన్ ముక్కను అక్కడ ఉన్నవారికి చూపిస్తూ ఉద్దేశపూర్వకంగా ప్రవర్తించాడు. ఇది గమనించిన అక్కడి సిబ్బంది అతడిని తక్షణమే ఆపాలని ప్రయత్నించగా, అతడు వారితో వాగ్వాదానికి దిగాడు. చివరికి సెక్యూరిటీ సాయంతో అతడిని ఆలయ ప్రాంగణం నుంచి బలవంతంగా బయటకు పంపించాల్సి వచ్చింది. ఇస్కాన్ ఆలయంలో ఈ విధంగా చికెన్ తీసుకురావడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

వివరాలు 

జాతి వివక్షను ప్రేరేపించే ఉద్దేశంతో చేసిన చర్య

మతపరమైన భావజాలాన్ని కించపరిచే చర్యలకు పాల్పడినందుకు అతనిపై అనేక మంది తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మరికొందరు ఇది జాతి వివక్షను ప్రేరేపించే ఉద్దేశంతో చేసిన చర్యగా అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారని, చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామని ఓ యూజర్ కామెంట్ చేశాడు. హిందువులు ప్రతీకారం తీసుకోరని భావించి ఆ యువకుడు ఇలా ప్రవర్తించి ఉండవచ్చని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో ఇదే..