Page Loader
Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధానిపై మరో సంచలన కేసు నమోదు
బంగ్లాదేశ్ మాజీ ప్రధానిపై మరో సంచలన కేసు నమోదు

Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధానిపై మరో సంచలన కేసు నమోదు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 01, 2025
03:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై అక్కడి ప్రాసిక్యూటర్లు మరో నేరాభియోగాన్ని నమోదు చేశారు. 2024లో విద్యార్థుల ఉద్యమాన్ని ఆమె క్రూరంగా అణచివేయాలని చూస్తూ సామాన్యులపై క్రూరత్వం ప్రదర్శించినట్లు ఆరోపణలు చేశారు. భద్రతా దళాలు, తన పార్టీ సభ్యులు ఆ ఉద్యమాన్ని అణచివేసేందుకు చర్యలు తీసుకోవాలని హసీనా నేరుగా ఆదేశించినట్లు గుర్తించినట్లు చెప్పారు. చీఫ్ ప్రాసిక్యూటర్ తాజుల్ ఇస్లాం తెలిపిన వివరాల ప్రకారం, దీనికి సంబంధించిన ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్లు, వీడియో ఆధారాలున్నాయి. ఈ కేసుకు 81 మంది సాక్షులుగా ఉన్నారు. దేశంలో సంక్షోభ సమయాల్లో భద్రతా దళాలు చేపట్టిన చర్యలకు హసీనానే బాధ్యురాలని ఆయన స్పష్టం చేశారు. ఆమె అణచివేత చర్యల కారణంగా సుమారు 1500మంది మరణించగా, 25,000 మంది గాయపడ్డారని తెలిపారు.

Details

100కు పైగా కేసులు నమోదు

గతేడాది బంగ్లాదేశ్‌లో అల్లర్లు చెలరేగిన నేపథ్యంలో ప్రధాని పదవికి హసీనా రాజీనామా చేశారు. దాదాపు 15 ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన ఆమె ఆగస్టులో ఢాకా నుంచి న్యూదిల్లీకి తరలారు. అక్కడే ప్రస్తుతం ఆశ్రయం పొందుతున్నారు. కొత్త ప్రభుత్వం, ప్రధాన సలహాదారుగా యూనస్ నేతృత్వంలో ఏర్పడిన వారు హసీనాపై వరుస కేసులు నమోదు చేస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులపై కూడా పలు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటివరకు 100కు పైగా కేసులు హసీనాపై నమోదు కాగా, ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రైబ్యునల్ ఆమెపై అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది.