Page Loader
Israel-Hezbollah: సెంట్రల్ బీరుట్‌పై ఇజ్రాయెల్‌ వైమానిక దాడి..22 మంది మృతి 
సెంట్రల్ బీరుట్‌పై ఇజ్రాయెల్‌ వైమానిక దాడి..22 మంది మృతి

Israel-Hezbollah: సెంట్రల్ బీరుట్‌పై ఇజ్రాయెల్‌ వైమానిక దాడి..22 మంది మృతి 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 11, 2024
08:44 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో ఇజ్రాయెల్‌-లెబనాన్‌ల మధ్య యుద్ధం కారణంగా పరిస్థితి తీవ్రతరం అవుతోంది. ఇటీవల ఇజ్రాయెల్‌ లెబనాన్‌లోని బీరుట్‌ నగరంపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడులలో 22 మంది మరణించారు. లెబనాన్‌ ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించిన ప్రకటన ప్రకారం, "ఇజ్రాయెల్‌ లెబనాన్‌ రాజధాని బీరుట్‌పై వైమానిక దాడులు చేసింది. ఈ దాడులలో 22 మంది మరణించగా, 117 మంది గాయపడ్డారు."

వివరాలు 

యూఎన్‌ శాంతి పరిరక్షకులపై  ఇజ్రాయెల్‌ కాల్పులు 

ఇదిలా ఉండగా.., యూఎన్‌ శాంతి పరిరక్షణ కార్యాలయంపై ఇజ్రాయెల్‌ దళాలు కాల్పులు జరిపినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు గాయపడ్డారని సమాచారం. ఇటలీ రక్షణమంత్రి గైడో క్రోసెట్టో ఈ దాడులను ఖండించారు. ఇజ్రాయెల్‌ చర్యలను యుద్ధ నేరంగా పరిగణిస్తామని ఆయన అన్నారు. ఈ దాడులపై వాషింగ్టన్‌ కూడా స్పందించింది. హెజ్‌బొల్లా లక్ష్యాలను ఆర్థికంగా ఇజ్రాయెల్‌ కూల్చివేయడానికి చేసిన దాడులు యూఎన్‌ శాంతి పరిరక్షకుల భద్రతకు ప్రమాదాన్ని కలిగిస్తాయని పేర్కొంది. ఇజ్రాయెల్‌ దాడుల దృష్ట్యా యూఎన్‌ శాంతి పరిరక్షకులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించింది.