John Kirby : జాతివివక్షకు,హింసకు తావు లేదు'.. భారతీయ విద్యార్థులపై దాడులను ఖండించిన అమెరికా
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలోని భారత సంతతి వారిపై వరుస దాడుల నేపథ్యంలో వైట్‌హౌస్ తాజాగా స్పదించింది.
అమెరికాలో జాతివివక్షకు,హింసకు తావు లేదని తేల్చింది.అమెరికా ప్రభుత్వం ఈ దాడులను ఖండిస్తోందని స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ విభాగం కో-ఆర్డినేటర్ జాన్ కిర్బీ తెలిపారు.
ఈదాడులు చేరిన వారికీ కఠిన శిక్షలు పడేలా చేస్తామన్నారు.దాడులని అరికట్టేందుకు జో బైడెన్ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
గత కొన్నివారాల్లో కనీసం నలుగురు భారతీయ అమెరికన్ విద్యార్థులు మరణించినట్లు యునైటెడ్ స్టేట్స్ నివేదించింది.
డిపార్ట్మెంట్ స్టోర్‌లో పార్ట్‌టైమ్‌గా పనిచేస్తున్న వివేక్ సైనీ అనే విద్యార్థి జనవరిలో జార్జియాలోని లిథోనియాలో డ్రగ్ అడిక్ట్ చేసిన దాడిలో మరణించాడు.
ఇండియానా వెస్లియన్ యూనివర్సిటీలో సయ్యద్ మజాహిర్ అలీ అనే భారతీయ విద్యార్థి ఫిబ్రవరిలో దాడికి గురయ్యాడు.
Details
విద్యను అభ్యసిస్తున్న వారి కోసం మెరుగైన భద్రతా చర్యలు అవసరం : అజయ్ జైన్
యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాయిస్ అర్బానా-ఛాంపెయిన్కు చెందిన అకుల్ ధావన్,పర్డ్యూ యూనివర్సిటీకి చెందిన నీల్ ఆచార్య జనవరిలో రాత్రిపూట తక్కువ ఉష్ణోగ్రతలకు ఎక్కువ కాలం బహిర్గతం కావడం,మద్యపానం కారణంగా మరణించారు.
సిన్సినాటిలోని లిండ్నర్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో భారతీయ సంతతికి చెందిన శ్రేయాస్ రెడ్డి బెనిగేరి అనే విద్యార్థి ఈ నెల ఒహియోలో శవమై కనిపించాడు.
భారతీయ అమెరికన్ కమ్యూనిటీ నాయకుడు అజయ్ జైన్ భూటోరియా మాట్లాడుతూ, ఈ విద్యార్థులు వేర్వేరు సంఘటనలలో విషాదకరమైన మరణాల పట్ల తీవ్ర ఆందోళనకు గురయ్యారని..యుఎస్‌లో విద్యను అభ్యసిస్తున్న వారి కోసం మెరుగైన భద్రతా చర్యల తక్షణ అవసరాన్ని నొక్కి చెప్పారు.
కళాశాల అధికారులు, స్థానిక పోలీసులు తక్షణమే ఈ సంఘటనలను పరిష్కరించాలని ఆయన కోరారు.