LOADING...
Jaishankar: జైశంకర్ వ్యాఖ్యలను ప్రసారం చేసినందుకు ఆస్ట్రేలియా టుడేపై కెనడా సర్కార్ నిషేధం..
జైశంకర్ వ్యాఖ్యలను ప్రసారం చేసినందుకు ఆస్ట్రేలియా టుడేపై కెనడా సర్కార్ నిషేధం..

Jaishankar: జైశంకర్ వ్యాఖ్యలను ప్రసారం చేసినందుకు ఆస్ట్రేలియా టుడేపై కెనడా సర్కార్ నిషేధం..

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 08, 2024
10:39 am

ఈ వార్తాకథనం ఏంటి

కెనడాతో ఉన్న దౌత్య సంబంధాలు క్షీణిస్తుండడంతో కూడా, కెనడా తన విధానంలో ఎలాంటి మార్పు చేయలేదు. పైగా, కెనడా మరింత దుందుడుకుగా వ్యవహరిస్తూ, భారత్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటోంది. విదేశాంగమంత్రి ఎస్‌.జైశంకర్, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్‌ల మధ్య జరిగిన సంయుక్త విలేకరుల సమావేశాన్ని ప్రసారం చేసినందుకు 'ఆస్ట్రేలియా టుడే' మీడియా సంస్థపై కెనడా చర్యలు తీసుకుంది. ఆ సంస్థకు సంబంధించిన సామాజిక మాధ్యమ ఖాతాలు, కొన్ని పేజీలను స్తంభింపజేసింది.

వివరాలు 

కెనడా చర్యలపై తీవ్రంగా వ్యతిరేకించిన భారత్‌ 

ఈ పరిణామాలపై ఆస్ట్రేలియా టుడే సంస్థ మేనేజింగ్ ఎడిటర్ జితార్థ్‌ జై భరద్వాజ్‌ స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ''ప్రతికూలతలకు అలొచించకుండా, ముఖ్యమైన కథనాలను, గొంతుకలను ప్రజలకు అందించడమే మా లక్ష్యం. మాకు లభిస్తున్న మద్దతు స్వేచ్ఛాయుత మీడియా ప్రాముఖ్యతను సూచిస్తోంది. పారదర్శకత, కచ్చితత్వంతో కూడిన కథనాలను అందించడంలో మా ప్రయత్నాలు కొనసాగిస్తాము'' అని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, కెనడా చర్యలపై భారత్‌ తీవ్రంగా వ్యతిరేకించింది. వాక్‌ స్వాతంత్ర్యం విషయంలో కెనడా మాటలు, చర్యలకు పొంతన లేదని విమర్శించింది.