LOADING...
US-Israel: దోహా దాడి గురించి అమెరికాకు ముందుగానే తెలుసు.. వెలుగులోకి కీలక రిపోర్ట్!
దోహా దాడి గురించి అమెరికాకు ముందుగానే తెలుసు.. వెలుగులోకి కీలక రిపోర్ట్!

US-Israel: దోహా దాడి గురించి అమెరికాకు ముందుగానే తెలుసు.. వెలుగులోకి కీలక రిపోర్ట్!

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 17, 2025
11:27 am

ఈ వార్తాకథనం ఏంటి

ఖతార్‌లోని హమాస్ నాయకులే లక్ష్యంగా గత వారం ఇజ్రాయెల్ తీవ్ర వేగంతో దాడులు నిర్వహించింది. ఈ దాడులు ప్రధానంగా వైమానిక యూనిట్లు, డ్రోన్ల ద్వారా జరిగాయి. దోహాలోని నివాస ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అయితే, హమాస్ అగ్రనాయకులు అందరూ ఈ దాడులలో తప్పించుకున్నప్పటికీ, కొంతమంది బంధువులు,ఒక ఖతార్ ప్రభుత్వ అధికారి బలైపోయారు. ఈ దాడులు అంతర్జాతీయంగా తీవ్ర వివాదానికి కారణమయ్యాయి. ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్ చర్యలను తీవ్రంగా ఖండించగా, ఖతార్‌కు మద్దతుగా నిలిచాయి.

వివరాలు 

ట్రంప్ వాదనను ఖండించిన జర్నలిస్టులు 

ఇక ఈఘటనపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్,ఖతార్‌పై ఇజ్రాయెల్ దాడి విషయం తనకు తెలియదని తెలిపారు. ఈదాడి తన ఆదేశాల వల్ల జరగలేదు అని,పూర్తిగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నిర్ణయంతో మాత్రమే జరిగింది అని స్పష్టం చేశారు. ఖతార్ తన మిత్ర దేశమని,భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగవని హామీ ఇచ్చారు. అయితే,ట్రంప్ వాదనను కొంతమంది జర్నలిస్టులు ఖండించారు.వారు ఖతార్‌లోని దోహా దాడి గురించి అమెరికాకు ముందే తెలిసి ఉండవచ్చని వాదన చేశారు. హమాస్ నాయకులపై ఇజ్రాయెల్ దాడి చేయడానికి కేవలం గంటముందే,ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ట్రంప్‌కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారని,కనీసం ముగ్గురుసీనియర్ ఇజ్రాయెల్ అధికారులు ఈ విషయాన్ని ఒక రిపోర్టర్‌తో వెల్లడించారని ఆక్సియోస్ పత్రికా ప్రతినిధి బరాక్ రవిద్ తెలిపారు.

వివరాలు 

రిపోర్టర్ -ట్రంప్ చెప్పేదానికి ఏ మాత్రం పొంతన లేదు

క్షిపణులు గాల్లోకి ఎగిరిన తర్వాత కాదు, క్షిపణులు ఎగరవేముందే ఉదయం 8 గంటల ప్రాంతంలో ట్రంప్‌కు సమాచారం అందిందని ముగ్గురు ఇజ్రాయెల్ సీనియర్ అధికారులు తనకు చెప్పారు. వాస్తవానికి ఉదయం 7:45 గంటలకే నెతన్యాహు ట్రంప్‌కు ఫోన్ చేశాడని, నాల్గో అధికారి కూడా ఈ విషయాన్ని ధృవీకరించినట్లు రిపోర్టర్ పేర్కొన్నారు. ఇటీవల ట్రంప్‌ను ఇదే విషయాన్ని విలేకరి మరోసారి ప్రశ్నించగా దాడి గురించి ముందు చెప్పలేదని.. దాడి తర్వాత చెప్పరని చెప్పుకొచ్చారు. కానీ ప్రస్తుతం రిపోర్టర్ చెప్పేదానికి-ట్రంప్ చెప్పేదానికి ఏ మాత్రం పొంతన లేదు.