USA: చైనాను దెబ్బతీయడానికి రంగంలోకి బీ-2 స్టెల్త్ బాంబర్
విమాన వాహక నౌకలను పెంచుకోవడానికి ఇప్పటికే చైనా ప్రణాళికలను రచిస్తోంది. మరోవైపు తక్కువ ఖర్చుతో కూడుకున్న బాంబులతో ఎయిర్ క్రాప్ట్ క్యారియర్లను ధ్వంసం చేసే శక్తిని అమెరికా పరీక్షించింది. దీని కోసం ప్రత్యేకంగా బీ-2స్టెల్త్ బాంబర్లను అమెరికా రంగంలోకి దింపింది. హవాయి సమీపంలోని ద్వీపం వద్ద ఈ నెల 19న అమెరికా ప్రయోగించింది.
'క్విక్‌సింక్' ను విజయవంతంగా ప్రయోగించిన అమెరికా
వేగంగా పుట్టుకొచ్చే ముప్పులను అతి తక్కువ ఖర్చుతో ఎలా ధ్వంసం చేయాలో సాధన చేశామని అగ్రరాజ్యం స్పష్టం చేసింది. ఈ పరీక్షల కోసం అమెరికా 820 అడుగుల పొడవు.. 39,000 టన్నుల బరువు ఉన్న 'యూఎస్ఎస్ తర్వా' అనే యాంఫీబియస్ నౌకను ఏర్పాటు చేసుకుంది. దీనిపైన బీ-2 స్టెల్త్ బాంబర్, ఒక చౌకైన గైడెడ్ బాంబ్ 'క్విక్‌సింక్' ను ఇప్పటికే విజయవంతంగా ప్రయోగించింది.
గగనతలంలోనూ బీ-2 స్టెల్త్ ప్రయాణించగలదు
ఇది గగనతలంలో నుంచైనా బీ-2స్టెల్త్ ప్రయాణించే శక్తి ఉంది. దీని బరువు సూమారు 2వేల పౌండ్ల వరకు ఉంటుంది. బీ-2స్టెల్త్ ను శత్రువు గుర్తించలేడని ఎయిర్ ఫోర్స్ రీసెర్చి ల్యాబ్ తెలిపింది. ప్రస్తుతం చైనా వద్ద 36,000 టన్నులున్న టైప్ 075 శ్రేణి యాంఫీబియస్ నౌకలు మూడు ఉన్నాయి. ఇక చైనా సముద్ర శక్తిని చూసి అమెరికా, దాని మిత్ర దేశాలు భయపడుతున్నాయని గ్లోబల్ టైమ్స్ పత్రిక పేర్కొంది.