Page Loader
Bangladesh: భారత టీవీ ఛానళ్లపై నిషేధం విధించాలని బంగ్లాదేశ్‌ హైకోర్టులో పిటిషన్‌ 
భారత టీవీ ఛానళ్లపై నిషేధం విధించాలని బంగ్లాదేశ్‌ హైకోర్టులో పిటిషన్‌

Bangladesh: భారత టీవీ ఛానళ్లపై నిషేధం విధించాలని బంగ్లాదేశ్‌ హైకోర్టులో పిటిషన్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 03, 2024
10:26 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీలపై జరుగుతున్న దాడులు, ఆందోళనకరమైన పరిస్థితులను సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత టీవీ ఛానళ్లను బంగ్లాదేశ్‌లో నిషేధించాలని కోరుతూ అక్కడి హైకోర్టులో రిట్ పిటిషన్‌ దాఖలయింది. ఈ విషయాన్ని అక్కడి మీడియా కథనాల్లో వెల్లడించింది. బంగ్లాదేశ్‌ సుప్రీంకోర్టు లాయర్‌ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. భారత టీవీ ఛానళ్లు బంగ్లాదేశ్‌ విరుద్ధంగా ప్రచారం చేస్తున్నాయని న్యాయవాది ఆరోపించారు. ఈ రకమైన దుష్ప్రచారాలు రెండు దేశాల మధ్య సంబంధాలకు హాని కలిగించే అవకాశం ఉందని, దీనివల్ల బంగ్లాదేశ్‌ సార్వభౌమత్వం ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు వచ్చే వారంలో విచారణ జరపనుందని సమాచారం.

వివరాలు 

హిందువులు భారీ స్థాయిలో నిరసనలు

ఇస్కాన్‌ సంస్థ బంగ్లాదేశ్‌లోని హిందువులకు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. బంగ్లాదేశ్‌లో జరిగిన ఒక ర్యాలీలో ఇస్కాన్‌ ప్రచారకర్త చిన్మయ్‌ కృష్ణదాస్‌ పాల్గొన్నారు. ఆయనపై బంగ్లాదేశ్‌ జెండాను అవమానించడం అనే ఆరోపణలు చేశారు. దీనిపై ఢాకా పోలీసులు చిన్మయ్‌ను అరెస్టు చేయడంతో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ అరెస్టును వ్యతిరేకిస్తూ అక్కడి హిందువులు భారీ స్థాయిలో నిరసనలు చేపట్టారు. ఈ నిరసనలలో ఓ న్యాయవాది మరణించడంతో, ఇస్కాన్‌ను నిషేధించాలని మరో న్యాయవాది పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే, ఢాకా హైకోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. బంగ్లాదేశ్‌లో ఇస్కాన్‌ కార్యకలాపాలపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో దానిపై అటార్నీ జనరల్‌కు నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి.

వివరాలు 

మూడు దేవాలయాలపై దాడులు

అలాగే, బంగ్లాదేశ్‌ చటోగ్రామ్‌లో జరిగిన హిందూ వ్యతిరేక దాడుల్లో, కొందరు ఆందోళనకారులు మూడు దేవాలయాలపై దాడులు జరిపారు. ఈ ఘటనలపై స్పందించిన భారత్‌... దేశంలో మైనారిటీలు సహా అందరి ప్రాణాలు, స్వేచ్ఛను కాపాడాలని, ఢాకా ప్రభుత్వం గతంలో చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేసింది.