Sheikh Hasina:బంగ్లాదేశ్ మాజీ ప్రధానిపై అరెస్ట్ వారెంట్ జారీ..నవంబర్ 18లోగా ఆమెను అరెస్టు చేయండి
బంగ్లాదేశ్‌కు చెందిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ICT of Bangladesh) షేక్ హసీనా మీద అరెస్టు వారెంట్ జారీ చేసింది. నవంబర్ 18లోగా ఆమెను అరెస్టు చేసి, ట్రైబ్యునల్ ఎదుట హాజరుకావాలని ICT చీఫ్ ప్రాసిక్యూటర్ మహమ్మద్ తజుల్ ఇస్లాం ఆదేశాలు ఇచ్చారు. రిజర్వేషన్లపై విద్యార్థుల నిరసనలు హింసాత్మకంగా మారడంతో, షేక్ హసీనా ప్రధానిగా ఉన్న సమయంలో పదవి నుంచి వైదొలిగారు. ఆ తర్వాత ఆమె భారత్‌లో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. జులై 15 నుంచి ఆగస్టు 5 మధ్య జరిగిన మారణహోమం, ఇతర నేరాల ఆరోపణలపై, ఆమెకు వ్యతిరేకంగా ICTకి 60 ఫిర్యాదులు అందాయి.
విద్యార్థి సంఘాలు హసీనా భారత్‌లో ఉండటాన్ని వ్యతిరేకిస్తున్నాయి.
వాటిపై ట్రైబ్యునల్ ఇటీవల దర్యాప్తు ప్రారంభించింది. భారత్‌లో ఆశ్రయం పొందుతున్న ఆమెను బంగ్లాదేశ్‌కు రప్పించాలని, ఆమెపై అరెస్టు వారెంట్లు జారీ చేస్తామని ICT నూతన ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు. ఆమెను స్వదేశానికి రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు, ఈ క్రమంలోనే తాజా పరిణామం చోటుచేసుకుంది. హసీనా పాలనపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థి సంఘాలు ఆమె భారత్‌లో ఉండటాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో,బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ)భారత్ ప్రభుత్వాన్ని హసీనాను చట్టబద్ధంగా తమ దేశానికి అప్పగించాలంటూ డిమాండ్ చేసింది. మరోవైపు, ఆమె దౌత్య పాస్‌పోర్టు రద్దు అయ్యిందని సమాచారం ఉంది. హసీనా హయాంలో ఎంపీలకు జారీ చేసిన దౌత్య పాస్‌పోర్టులను బంగ్లాదేశ్ హోం మంత్రిత్వ శాఖ రద్దు చేసినట్లు ప్రకటించింది.
హసీనాను బంగ్లాదేశ్‌కు రప్పించేందుకు యూనస్ ప్రభుత్వం యత్నాలు
ఈ పాస్‌పోర్టు ఉన్నవారు కొన్ని నిర్దిష్ట దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. ఆగస్టు 5న పదవి నుంచి దిగిపోయి, భారత్‌కు చేరుకున్న తర్వాత ఆమె బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. ఈ తరుణంలో, హసీనాను బంగ్లాదేశ్‌కు రప్పించేందుకు యూనస్ ప్రభుత్వం అన్ని యత్నాలు చేస్తుందని ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ గతంలో పేర్కొంది. హసీనాను అప్పగించాలా వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత భారత్‌పైనే ఉందని వ్యాఖ్యానించారు.