Page Loader
Bangladesh: స్వాతంత్ర్య సమరయోధుల చట్టం సవరణ.. జాతిపితగా బంగ్లాదేశ్ ముజిబుర్ రెహమాన్‌ పేరు తొలగింపు 
జాతిపితగా బంగ్లాదేశ్ ముజిబుర్ రెహమాన్‌ పేరు తొలగింపు

Bangladesh: స్వాతంత్ర్య సమరయోధుల చట్టం సవరణ.. జాతిపితగా బంగ్లాదేశ్ ముజిబుర్ రెహమాన్‌ పేరు తొలగింపు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 04, 2025
04:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం,బంగబంధు ముజిబుర్ రహ్మాన్, మాజీ ప్రధాని షేక్ హసీనా కుటుంబ చరిత్రను కనుమరుగు చేయడానికి చర్యలు తీసుకుంటోంది. ఈ ప్రయత్నాల్లో భాగంగా, దేశ పితాగా గుర్తింపు పొందిన బంగబంధు షేక్ ముజిబుర్ రహ్మాన్‌కు 'ఫాదర్ ఆఫ్ నేషన్' అనే బిరుదును తీసివేసింది. అదే విధంగా స్వాతంత్ర్య సమరయోధుల పదానికి కొత్త అర్థం ఇచ్చింది. ఈ సవరణలు 'నేషనల్ ఫ్రీడమ్ ఫైటర్స్ కౌన్సిల్ యాక్ట్'లో చేయబడ్డాయని స్థానిక మీడియా నివేదించింది. మంగళవారం రాత్రి న్యాయ శాఖ ఈ సవరణల కోసం ఆర్డినెన్స్ జారీ చేసింది.

వివరాలు 

ముజిబుర్ రహ్మాన్ చిత్రం ఉండే కరెన్సీ నోట్ల రద్దు 

మొదటిది, యూనస్ ప్రభుత్వం జాతిపితగా పిలువబడే బంగబంధు షేక్ ముజిబుర్ రహ్మాన్ పేరు, చట్టాల్లోని ఆయనకి సంబంధించిన పదాలను తీసివేసింది. ఇటీవల ముజిబుర్ రహ్మాన్ చిత్రం ఉండే కరెన్సీ నోట్లను కూడా రద్దు చేసి, వాటి స్థానంలో కొత్త డిజైన్‌లతో కూడిన నోట్లను విడుదల చేసింది. కొత్త నోట్లపై హిందూ, బౌద్ధ ఆలయాల ఫోటోలు ముద్రించబడ్డాయి. ఈ కొత్త నోట్ల జారీ జూన్ 1 నుంచి ప్రారంభమైంది. బంగ్లాదేశ్ బ్యాంక్ ప్రతినిధి ప్రకారం, కొత్త డిజైన్ సిరీస్ ప్రకారం కరెన్సీ నోట్లపై మానవ చిత్రాలు ఉండవు. వాటి బదులు ప్రకృతి దృశ్యాలు, ప్రసిద్ధ ప్రదేశాలు ముద్రిస్తారు.

వివరాలు 

బంగ్లాదేశ్ పాఠ్యపుస్తకాల్లో బంగబంధు ముజిబుర్ రహ్మాన్ ప్రాధాన్యత

తూర్పు పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్‌గా పేరుపడిన తర్వాత 1972లో దేశం జారీ చేసిన కరెన్సీ నోట్లపై ఒక మ్యాప్ కూడా ముద్రించారు. తరువాత షేక్ హసీనా తండ్రి ముజిబుర్ రహ్మాన్ చిత్రంతో కూడిన నోట్లను ప్రవేశపెట్టారు. అయితే గత ఆగస్టులో షేక్ హసీనా దేశాన్ని విడిచి వెళ్లాక కూడా తాత్కాలిక ప్రభుత్వం ఆ నోట్లను కొనసాగించింది. తాజాగా అవిరద్దు చేసి కొత్త డిజైన్లతో నోట్లను విడుదల చేశారు. ఇలా ప్రభుత్వ చర్యలు బంగ్లాదేశ్ పాఠ్యపుస్తకాల్లో బంగబంధు ముజిబుర్ రహ్మాన్ ప్రాధాన్యతను కూడా తగ్గిస్తున్నాయి. 1971 బంగ్లా విముక్తిపోరాట సమయంలో స్వాతంత్ర్య ప్రకటన తొలిసారిగా జియావుర్ రహ్మాన్ చేసినట్లు పాఠ్యపుస్తకాలు సవరిస్తున్నాయి. ఇంతకు ముందు ఈ ప్రకటన బంగబంధు ముజిబుర్ రహ్మాన్ చేసినట్లు ఉండేది.

వివరాలు 

త్వరలోనే కొత్త పుస్తకాలు సిద్ధం

నేషనల్ కరికులమ్ టెక్స్ట్ బుక్ బోర్డ్ ప్రొఫెసర్ ఏకేఎం రియాజుల్ హుస్సేన్ ఈ విషయంపై స్పందిస్తూ, కొత్త పుస్తకాలను 2025కి సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. 1971 మార్చి 26న జియావుర్ రహ్మాన్ స్వాతంత్ర్య ప్రకటన చేసినట్లు,మరుసటి రోజే (మార్చి 27) ఆయన బంగబంధు తరఫున ఇలాంటి ప్రకటన వెలువరించినట్లు పేర్కొన్నారు. ఉచిత పాఠ్యపుస్తకాల్లో ఈ విషయాన్ని కూడా చేర్చారని చెప్పారు. అవామీ లీగ్ మద్దతుదారులు మాత్రం ముజిబుర్ రహ్మాన్,మేజర్ జియావుర్ రహ్మాన్ కలిసి ఈ ప్రకటన చేశారు అని బలంగా నమ్ముతారు. వారు చెబుతుంటే జియావుర్ ఆ ప్రకటనను ముజిబ్ ఆదేశాల మేరకు చదవడం మాత్రమే. అయితే బీఎన్‌పీ పార్టీ వేరే అభిప్రాయం ప్రకటిస్తూ,జియావుర్ స్వయంగా ఈ ప్రకటన చేసారనే విషయాన్ని పేర్కొంటోంది.