Loading...
Bangladesh: మక్కా రక్షణ ఒప్పందంలో చేరడంలో ముప్పులేదు: బంగ్లాదేశ్
మక్కా రక్షణ ఒప్పందంలో చేరడంలో ముప్పులేదు: బంగ్లాదేశ్

Bangladesh: మక్కా రక్షణ ఒప్పందంలో చేరడంలో ముప్పులేదు: బంగ్లాదేశ్

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 31, 2026
01:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

'మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం'లో చేరడం వల్ల తమ దేశానికి ఎలాంటి భద్రతాపరమైన ముప్పు ఉండదని బంగ్లాదేశ్‌ స్పష్టం చేసింది. ఈ ఒప్పందంలో చేరినప్పటికీ ఇతర దేశాలు, భాగస్వాములతో ఉన్న సంబంధాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని పేర్కొంది. సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్థాన్‌ ఇటీవల ఈ సంయుక్త రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఒప్పందంలోని నిబంధనల ప్రకారం.. ఈ మూడు దేశాల్లో ఏదైనా ఒక దేశంపై సైనిక దాడి జరిగితే, అది మూడు దేశాలపైనే జరిగిన దాడిగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌ కూడా ఒప్పందంలో చేరే అవకాశాలపై చర్చ జరుగుతోంది.

వివరాలు 

ఆహ్వానిస్తే చేరతాం

మక్కా ఒప్పందంలో చేరేందుకు తమకు ఆహ్వానం అందితే తాము కూడా భాగస్వామ్యమవుతామని బంగ్లాదేశ్‌ విదేశాంగ మంత్రి ఖలీలుర్‌ రహ్మాన్‌ ఇటీవల పార్లమెంటులో వెల్లడించారు.

ఈ ప్రకటనకు కొనసాగింపుగా విదేశాంగ శాఖ సహాయమంత్రి హుమయూన్‌ కొబిర్‌ ఆదివారం విలేకరుల సమావేశంలో తాజా వ్యాఖ్యలు చేశారు.

మరికొన్ని దేశాలతో సంబంధాలకు ఇబ్బంది ఉండదు

మక్కా సంయుక్త రక్షణ ఒప్పందంలో చేరడం వల్ల ఇతర భాగస్వామ్య దేశాలతో బంగ్లాదేశ్‌ సంబంధాలకు ఎలాంటి సమస్య తలెత్తదని హుమయూన్‌ కొబిర్‌ తెలిపారు.

ఈ ఒప్పందాన్ని కొత్త అవకాశాలకు మార్గం చూపే వినూత్న ప్రయత్నంగా ఆయన అభివర్ణించారు.

అంతర్జాతీయ భాగస్వామ్యాలను కొనసాగిస్తూనే కొత్త రక్షణ సహకార అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశం దీనివల్ల లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ADVERTISEMENT