Obama: బరాక్ ఒబామా, మిచెల్ ఒబామా విడాకులు తీసుకోనున్నారా..?
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మిచెల్ ఒబామా అన్యోన్యమైన దంపతులుగా ప్రజాదరణ పొందారు.
ఎంత బిజీగా ఉన్నా కుటుంబ జీవితానికి సమ ప్రాధాన్యత ఇస్తూ మోస్ట్ పాపులర్ కపుల్‌గా గుర్తింపు పొందిన ఈ జంట గురించి ఇటీవల కొన్ని ఊహాగానాలు చర్చనీయాంశంగా మారాయి.
బరాక్ ఒబామా, మిచెల్ త్వరలో విడాకులు తీసుకోనున్నారని వార్తలు వెలువడుతున్నాయి.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఒబామా హాజరవుతారని, అయితే మిచెల్ దూరంగా ఉంటారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
దీంతో ఒబామా దంపతుల మధ్య మనస్పర్థలు ఉన్నాయనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
వివరాలు
2000లోనే మిచెల్ ఒబామాకు విడాకులు
ఇటీవల జిమ్మీ కార్టర్ అంత్యక్రియల కార్యక్రమానికి కూడా మిచెల్ హాజరుకాకపోవడం వల్ల ఈ వదంతులకు మరింత బలం చేకూర్చినట్లు అయ్యింది.
కొంతమంది నెటిజన్లు ఈ ఊహాగానాలను వ్యతిరేకించగా, 2000లోనే మిచెల్ ఒబామాకు విడాకులు ఇవ్వాలని అనుకున్నారని 2012లో విడుదలైన ఒక పుస్తకంలో పేర్కొనడం విశేషం.
1992లో వివాహ బంధంతో ఒక్కటైన ఒబామా దంపతులకు సాషా, మలియా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
2009లో బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో, తమ వైవాహిక బంధంలో వచ్చిన చిన్న చిన్న సమస్యలను అధిగమించేందుకు కౌన్సెలింగ్ తీసుకున్నామని మిచెల్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.