Justin Trudeau: రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించిన జస్టిన్ ట్రూడో
ఈ వార్తాకథనం ఏంటి
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సొంత దేశం, సొంత పార్టీ, ప్రపంచ దేశాల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.
ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్‌తో వైరం పెంచుకోవడంతో పాటు, ఖలిస్తానీవాదులకు మద్దతు ఇచ్చినందుకు విమర్శలు ఎదురయ్యాయి.
ఇక, అమెరికాలో ట్రంప్ గెలుపుతో కూడా అతడు అమెరికాతో సంబంధాలు కష్టతరమైన పరిస్థితికి చేరాయి.
ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో ట్రూడో గెలవడం కష్టమని పోల్స్ సూచిస్తున్నాయి, అతడి పాపులారిటీ పతనమైంది, దీనితో సొంత పార్టీ నుండి ప్రధాని పదవికి రాజీనామా చేయాలని డిమాండ్లు రావడంతో రాజీనామా చేయడానికి సిద్దమైనట్లు ట్రూడో ప్రకటించారు.
వివరాలు
తదుపరి ఏం చేయాలో ఆలోచించడానికి సమయం కావాలి: ట్రూడో
తాజాగా, మరో సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే పలు సమస్యలతో కష్టాల్లో ఉన్న ట్రూడో, రాబోయే ఎన్నికల్లో పోటీ చేయనని, రాజకీయాలను విడిచిపెట్టే అవకాశం ఉందని ప్రకటించారు.
బుధవారం ట్రూడో గ్లోబల్ న్యూస్ ఆఫ్ కెనడాతో మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో పోటీ చేయమని, రాజకీయాలపై ఆసక్తి లేకుండా తాను తదుపరి ఏం చేయాలో ఆలోచించడానికి సమయం కావాలని చెప్పారు.
ట్రూడో, కెనడా మంత్రులతో సహా, అమెరికాలోని కెనడా రాయబారిని కలిశారు.
ట్రంప్ కెనడా దిగుమతులపై సుంకాలు పెడతానని బెదిరించిన విషయం పై చర్చించడానికి సమావేశాలు జరిగినట్టు తెలుస్తోంది.
వివరాలు
వలసలు, ద్రవ్యోల్బణం, ఉపాధి, హౌసింగ్ సంక్షోభంలో ట్రూడో ప్రభుత్వం విఫలం
ట్రూడో తన లిబరల్ పార్టీ నాయకత్వానికి రాజీనామా చేయనున్నారు. కొత్త నాయకుడు ఎన్నికైన తర్వాత, కెనడా ప్రధాని పదవికి రాజీనామా చేస్తారు.
ఆగస్టులో జరిగే ఎన్నికల వరకు లిబరల్ పార్టీ నుండి ఎంపీగా కొనసాగుతారు.
2025 అక్టోబర్‌లో జరగనున్న ఎన్నికల్లో పియరీ పొయిలివ్రే, అతని కన్జర్వేటివ్ పార్టీ, ట్రూడో పార్టీకి పైచేయి ఉంటుందని సర్వేలు చూపిస్తున్నాయి.
వలసలు, ద్రవ్యోల్బణం, ఉపాధి, హౌసింగ్ సంక్షోభం వంటి కీలక అంశాల్లో ట్రూడో ప్రభుత్వం విఫలమైందని కెనడియన్లు భావిస్తున్నారు.