చైనాపై తప్పుడు ప్రచారాన్ని ఆపండి: కెనడాకు చైనా కౌంటర్
కెనడాలో ఖలిస్థానీ నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై చైనా చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ స్పందించారు. నిజ్జర్ హత్య విషయంలో కెనడా వాస్తవాలను గౌరవించాలని కోరారు. ఈ వ్యవహారంతో చైనాకు సంబంధం ఉందంటూ చేస్తున్న అసత్య ప్రచారాలను ఆపాలని మావో నింగ్ పేర్కొన్నారు. బీజింగ్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో మావో మాట్లాడారు. నిజ్జర్ హత్యతో చైనాకు సంబంధం ఉందంటూ వైరల్ అవుతున్న వీడియోలపై ఇటీవల కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జాలీ స్పందించారు. అయితే చైనాపై చేస్తున్న అబద్ధపు ప్రచారాలు చైనా-కెనడా మధ్య మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత దెబ్బతీస్తాయని అన్నారు.
చైనాపై తప్పుడు ప్రచారాన్ని ఆపండి: కెనడాకు చైనా కౌంటర్
కెనడా విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన ప్రకటన వాస్తవాలను తప్పుగా సూచిస్తుందని తప్పుదారి పట్టించేదిగా ఉందని నింగ్ అన్నారు. కెనడా విదేశాంగ మంత్రి మెలానీ ప్రకటనను చైనా తీవ్రంగా ఖండిస్తోందన్నారు. కొంత కాలంగా, కెనడా రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా తాము తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నామని ఆ దేశ విదేశాంగశాఖ ఆరోపించిందని, అయితే అందులో ఎలాంటి వాస్తవం లేదని మావో నింగ్ అన్నారు. చైనాపై దాడి చేయడానికి కెనడా అబద్ధాలు చెబుతోందని ఆమె అన్నారు.