LOADING...
Dalai Lama: దలైలామాకు భారతరత్నఇవ్వాలి.. కేంద్రానికి ఎంపీలు లేఖ 
దలైలామాకు భారతరత్నఇవ్వాలి.. కేంద్రానికి ఎంపీలు లేఖ

Dalai Lama: దలైలామాకు భారతరత్నఇవ్వాలి.. కేంద్రానికి ఎంపీలు లేఖ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 07, 2025
04:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

టిబెటన్‌ల ఆధ్యాత్మిక నాయకుడు దలైలామాకు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన 'భారతరత్న' అందించాలని కోరుతూ ఆల్స్ పార్టీ ఫోరమ్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దలైలామాకు భారత పార్లమెంటులో ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగించే అవకాశం కల్పించాలని ఫోరమ్ విజ్ఞప్తి చేసింది. ఈ లేఖను రాసిన ఫోరమ్ పేరు "ఆల్ పార్టీ ఇండియన్ పార్లమెంటరీ ఫోరం ఫర్ టిబెట్". ఇందులో భారతీయ జనతా పార్టీ (బీజేపీ), బిజూ జనతాదళ్ (బీజేడీ), జనతాదళ్ యునైటెడ్ వంటి పలు పార్టీల ఎంపీలు సభ్యులుగా ఉన్నారు. ఈ నెలలో రెండు సార్లు సమావేశమైన ఈ ఫోరమ్, దలైలామాకు 'భారతరత్న' ప్రదానం విషయమై ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపింది.

వివరాలు 

80 మంది ఎంపీలు సంతకం 

దలైలామాకు భారతరత్న పురస్కారాన్ని ఇవ్వాలన్న నామినేషన్‌కు మద్దతుగా సంతకాలను సేకరించేందుకు 10మంది సభ్యులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన సుమారు 80మంది పార్లమెంటు సభ్యుల సంతకాలు సమకూరాయి. ఈసంతకాలను త్వరలోనే ప్రధాన మంత్రి,రాష్ట్రపతికి అందజేయనున్నట్లు సమాచారం. ఈ అంశంపై రాజ్యసభ సభ్యుడు సుజీత్ కుమార్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 80 మంది ఎంపీలు విజ్ఞాన పత్రంపై సంతకాలు చేశారని,100మంది ఎంపీల సంతకాలు పూర్తయ్యాక అధికారికంగా వినతిపత్రాన్ని సమర్పిస్తామని తెలిపారు. ఈ సంతకాలలో ప్రతిపక్షాల ఎంపీల మద్దతూ ఉన్నదని స్పష్టం చేశారు.దీనికి మద్దతుగా కొన్ని పార్టీల ఎంపీలు స్వయంగా ముందుకు వచ్చి సంతకాలు చేయగా,మరికొందరు వీడియో సందేశాల ద్వారా తమ మద్దతును తెలియజేశారు.

వివరాలు 

 హిమాచల్ ప్రదేశ్‌లో ఘనంగా దలైలామా 90వ పుట్టినరోజు వేడుకలు

ఇంకా, దలైలామా పార్లమెంటు ఉభయ సభల ముందుగా ప్రసంగించే అవకాశాన్ని కల్పించాలన్న దిశగా, లోక్‌సభ స్పీకర్‌కు, రాజ్యసభ చైర్మన్‌కు కూడా ప్రత్యేకంగా లేఖలు రాసే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఇక మరోవైపు, బౌద్ధమత ప్రచారంలో విశేష సేవలందించిన దలైలామా 90వ పుట్టినరోజు వేడుకలు ఆదివారం రోజున హిమాచల్ ప్రదేశ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రపంచనలుమూలల నుండి వేలాది మంది బౌద్ధ సన్యాసులు హాజరయ్యారు.