LOADING...
Trump-Netanyahu: డొనాల్డ్ ట్రంప్ - బెంజమిన్ నెతన్యాహు మధ్య ఫోన్‌లో విభేదాలు
డొనాల్డ్ ట్రంప్ - బెంజమిన్ నెతన్యాహు మధ్య ఫోన్‌లో విభేదాలు

Trump-Netanyahu: డొనాల్డ్ ట్రంప్ - బెంజమిన్ నెతన్యాహు మధ్య ఫోన్‌లో విభేదాలు

వ్రాసిన వారు Sirish Praharaju
May 21, 2026
11:50 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్ అంశంపై అమెరికా,ఇజ్రాయెల్ దేశాల మధ్య విభేదాలు తాజాగా బహిర్గతమవడం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్,ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య ఇటీవలజరిగిన ఫోన్ సంభాషణ తీవ్ర ఉద్రిక్తత నడుమ సాగినట్లు అమెరికా వార్తా సంస్థలు వెల్లడించాయి. ముఖ్యంగా ఇరాన్‌పై మళ్లీ సైనిక దాడులు చేపట్టాలా లేదా చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం కనుగొనాలా అన్న అంశంపైనే ఇద్దరు నేతల మధ్య విభేదాలు తలెత్తినట్లు సమాచారం. ఈసంభాషణ తర్వాత ఇరాన్ వ్యవహారంలో అమెరికా, ఇజ్రాయెల్ ఒకే అభిప్రాయంతో ముందుకు సాగడం లేదని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారకుండా ఉండాలంటే దౌత్యపరమైన చర్చలకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

వివరాలు 

పశ్చిమాసియా రాజకీయాలపై ప్రభావం

అయితే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాత్రం ఇరాన్‌ను నియంత్రించాలంటే సైనిక చర్య తప్ప మరో మార్గం లేదని గట్టిగా నమ్ముతున్నారు. ముఖ్యంగా ఇరాన్ అణు సామర్థ్యాలను పూర్తిగా బలహీనపర్చేందుకు దాడులు కొనసాగాల్సిందేనని ఆయన అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. దాడులు నిలిపివేస్తే ఇరాన్ మరింత బలపడే అవకాశముందని ఇజ్రాయెల్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరోవైపు అమెరికా మాత్రం అరబ్ దేశాల సహకారంతో శాంతి చర్చలు, ఒప్పందాల దిశగా అడుగులు వేయాలని చూస్తోంది. ఇరాన్ విషయంలో మిత్రదేశాలైన అమెరికా, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఈ భిన్నాభిప్రాయాలు భవిష్యత్తులో పశ్చిమాసియా రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Advertisement