LOADING...
Joe Biden: 'ట్రంప్‌ 2024 ' టోపీ ధరించిన బైడెన్‌.. 9/11  స్మారక కార్యక్రమంలో ఆసక్తికర సంఘటన 
ట్రంప్‌ 2024 ' టోపీ ధరించిన బైడెన్‌

Joe Biden: 'ట్రంప్‌ 2024 ' టోపీ ధరించిన బైడెన్‌.. 9/11  స్మారక కార్యక్రమంలో ఆసక్తికర సంఘటన 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 12, 2024
10:13 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా చరిత్రలో అత్యంత విషాదకరమైన వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై ఉగ్రవాదుల దాడి ఘటన జరిగి 23 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా న్యూయార్క్‌లోని 9/11 మేమోరియల్‌ వద్ద ఒక సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు జో బైడెన్‌ పాల్గొన్నారు. ఆసక్తికరంగా, బైడెన్‌ కార్యక్రమం మధ్యలో 'ట్రంప్‌ 2024' అను ఉన్న ఓ టోపీని ధరించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సంస్మరణ కార్యక్రమంలో బైడెన్‌తో పాటు ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌,ఇతర ప్రముఖులు కూడా హాజరయ్యారు.

వివరాలు 

ఈ వీడియోను వైట్‌ హౌస్‌ ప్రతినిధి ఆండ్రూ బేట్స్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు

ఈ కార్యక్రమంలో 'ట్రంప్‌ 2024' అనే టోపీని ఒక ట్రంప్‌ మద్దతుదారుడు ధరించిన సంగతి తెలిసిందే. ఈ సన్నివేశాన్ని గమనించిన బైడెన్ ఆ వ్యక్తితో సరదాగా మాట్లాడి, ఆ టోపీని తీసుకుని ధరించారు. దీనికి సంబంధించిన వీడియో వైట్‌ హౌస్‌ ప్రతినిధి ఆండ్రూ బేట్స్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు, ఇది ఐక్యతకు నిదర్శనంగా అభివర్ణించారు. 9/11 మెమోరియల్‌ వద్ద జరిగిన సంస్మరణ కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌, మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ మధ్య మళ్లీ కరచాలనం జరిగిన సంగతి తెలిసిందే. పెన్సిల్వేనియాలో జరిగిన డిబేట్‌ సమయంలో కూడా వీరు చర్చా వేదికపై కరచాలనం చేసుకున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో ఇదే