Canada-USA: ట్రంప్ టారిఫ్‌లపై కెనడా కౌంటర్.. స్టార్‌లింక్ డీల్ రద్దు!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మిత్రదేశాలు, ప్రత్యర్థి దేశాలు అనే తేడా లేకుండా అందరిపైనా సుంకాల (US Tariffs) భారం మోపుతున్నారు.
తాజాగా పొరుగుదేశమైన కెనడాపైనా 25 శాతం టారిఫ్ విధించారు. ఈ నిర్ణయానికి కెనడా నుంచి తీవ్ర స్పందన వచ్చింది.
ఒంటారియో ప్రీమియర్ డగ్ ఫోర్డ్ ట్రంప్‌కు గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు.
Details
స్టార్‌లింక్ డీల్ రద్దు
ట్రంప్ ప్రకటించిన 25% టారిఫ్‌లు మంగళవారం నుంచే అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే కెనడా నుంచి ఇంధన ఎగుమతులపై 10% టారిఫ్ ఉంది. తాజా నిర్ణయాలు కెనడా నేతల్లో ఆగ్రహం రేపాయి.
ఈ క్రమంలో డగ్ ఫోర్డ్ సూటిగా స్పందిస్తూ, తాము ఆర్థికంగా దెబ్బతింటుంటే మౌనంగా ఉండబోమని ప్రకటించారు.
వారు ఒంటారియోను ధ్వంసం చేస్తుంటే, తాము ఊరుకోమని పేర్కొంది. కరెంట్ కోతలు విధించి, ఒంటారియో ప్రభుత్వం, స్టార్‌లింక్ మధ్య ఉన్న 100 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నామన్నారు.
ఇక అది ముగిసిందన్నారు. ట్రంప్ కెనడా ప్రజలను తక్కువ అంచనా వేస్తున్నారని, తమ స్టోర్ల నుంచి అమెరికా ఆల్కహాల్‌ను తొలగించాలనే ఆలోచనలో ఉన్నామని డగ్ ఫోర్డ్ ఘాటుగా వ్యాఖ్యానించారు.
Details
ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు
అమెరికా భారీగా ఇంధనాన్ని కెనడా నుంచే దిగుమతి చేసుకుంటోందన్నారు.
ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, హైడ్రో పవర్, సహజ వాయువు, ఎలక్ట్రిసిటీ వంటి అవసరాల్లో అమెరికా కెనడాపై ఆధారపడుతుందన్నారు.
వారు మా ఇంధనాన్ని వాడుకుంటారని, కానీ తమపై ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదని ఫోర్డ్ వ్యాఖ్యానించారు.
Details
స్టార్‌లింక్ ఒప్పందం ఏమిటి?
స్టార్‌లింక్ డీల్ కింద తొలుత 15,000 ఇళ్లకు, వాణిజ్య సముదాయాలకు హై-స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించాల్సి ఉంది.
అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఒంటారియో ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేసేసింది.
అమెరికా-కెనడా మధ్య వాణిజ్య యుద్ధం
ట్రంప్ నిర్ణయాలతో అమెరికా-కెనడా మధ్య వాణిజ్య సంబంధాలు మరింత ఉద్రిక్తతకు దారితీసే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.
టారిఫ్‌ల ప్రభావం రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలపై ఎలా పడుతుందనేది ఆసక్తిగా మారింది.