Canada : కెనడాకు భారత్ సూచనలు.. మతపరమైన దాడులు, ద్వేషపూరిత నేరాలపై నియంత్రించాలని విజ్ఞప్తి
కెనడా - భారత్ దేశాల మధ్య అలజడుల నేపథ్యంలో మతపరమైన ప్రదేశాలపై దాడులను ఆపాలని, ద్వేషపూరిత నేరాలను పరిష్కరించాలని భారత్, కెనడాకు సూచించింది. ఈ మేరకు జెనీవాలో జరిగిన ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి (UNHRC) సమీక్ష సమావేశంలో భారత శాశ్వత మిషన్ ప్రథమ కార్యదర్శి కేఎస్ మహమ్మద్ హుస్సేన్ ప్రసంగించారు. ఈ మేరకు ద్వేషపూరిత నేరాలను నియంత్రించాలని కెనడాకు భారత శాశ్వత మిషన్ ప్రథమ కార్యదర్శి కెఎస్ మహ్మద్ హుస్సేన్ సూచించారు. ఇదే సమయంలో హింసను ప్రేరేపించడం, ప్రార్థనా స్థలాలు, మైనారిటీలపై దాడులు చేయడం ద్వేషపూరిత నేరాలు, ప్రసంగాలను పరిష్కరించేందుకు కృషి చేయాలని మహ్మద్ హుస్సేన్ స్పష్టం చేశారు.
భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను దుర్వినియోగాన్ని నిరోధించాలి : భారత్
మరోవైపు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను దుర్వినియోగ చేయడాన్ని నిరోధించాలని, ఈ మేరకు కెనడా కఠినమైన చర్యలు తీసుకోవడం వంటివి బలోపేతం చేయాలని భారతదేశం తరఫున మహ్మద్ హుస్సేన్ సిఫార్సు చేశారు. భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్న హుస్సేన్ తన ప్రసంగంలో మానవ అక్రమ రవాణాను ఎదుర్కోనేందుకు తమ జాతీయ నివేదికను సమర్పించడాన్ని ఆయన స్వాగతించారు. కెనడా ప్రతినిధి బృంద చర్యలను భారతదేశం స్వాగతిస్తోందని, ఈ మేరకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. నేషనల్ హౌసింగ్ స్ట్రాటజీ యాక్ట్, 2019 అమలులోకి రావడాన్ని తాము ధృవీకరించామన్నారు.కెనడాలో మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి జాతీయ చట్టంగా అభివర్ణించారు. రెండు ప్రాంతాలపై జరిగిన దాడులను సమర్థవంతంగా నిరోధించాలని, మతపరమైన, జాతిపరమైన మైనారిటీల హక్కులను కాపాడాలన్నారు.