భారతీయులకు, విద్యార్థులకు కెనడా భరోసా.. ప్రతీవ్యక్తికి రక్షణ కల్పిస్తామని ప్రజాభద్రత మంత్రి ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ - కెనడా దేశాల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఈ రెండు దేశాలు పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలతోనే సాగుతున్నాయి.
ఈ మేరకు భారతీయులు, విద్యార్థులు కెనడాలో అప్రమత్తంగా ఉండాలని భారత ప్రభుత్వం సూచించింది. ఈ క్రమంలోనే కెనడాలో నివాసం ఉంటున్న ఇండియన్స్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది.
దీనిపై స్పందించిన కెనడా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆందోళనను కొట్టిపారేసింది. ప్రజా భద్రతలో కెనడా దేశం అత్యంత సురక్షితమైందని కెనడా ప్రజా భద్రత వ్యవహారాల శాఖ మంత్రి డొమినిక్ లెబ్లాంక్ అన్నారు.
భద్రతా విషయంలో ఎవరూ, ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రజారక్షణ అంశంలో తమ ప్రభుత్వం వెనుకంజ వేయబోదని స్పష్టం చేశారు.
details
ఆధారాలుంటే బహిర్గతం చేయాలన్న భారత్ సర్కార్
కెనడాలో నివసించే ప్రతి ఒక్కరికీ భద్రత కల్పించాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపైనే ఉందని, ప్రజా భద్రత వ్యవహారాల శాఖ మంత్రి డొమినిక్ లెబ్లాంక్ చెప్పుకొచ్చారు.
ఖలిస్థానీ అనుకూలవాదుల హెచ్చరికల నేపథ్యంలో సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో అదనపు భద్రతను కల్పించనున్నట్లు చెప్పారు.
భారతీయులకు, విద్యార్థులకు తమ దేశం సురక్షితమేనన్నారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిర్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల పాత్రపై ఏకంగా ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటన దుమారం రేపింది.
కెనడా ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదని, ట్రూడో వద్ద ఆధారాలుంటే బహిర్గతం చేయాలని సూచించింది.
ఈ మేరకు భారత్‌లోని కెనడా హైకమిషనర్‌కు సమన్లు జారీ చేసిన కేంద్రం, సమగ్ర వివరణ ఇవ్వాలని ఆదేశించింది.