
Bathukamma festivals: లండన్‌లో చేనేత బతుకమ్మ.. వైభవంగా దసరా ఉత్సవాలు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణతెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్‌డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో చేనేత బతుకమ్మ, దసరా ఉత్సవాలు సోమవారం ఘనంగా జరిగాయి.
ఈ వేడుకలకు బ్రిటన్ నలుమూలల నుంచి వచ్చిన 2,000 మందికి పైగా తెలుగు వారు హజరయ్యారు.
ప్రధాన అతిథులుగా హౌంస్లౌ మేయర్ కారెన్ స్మిత్, భారత సంతతికి చెందిన మాజీ ఎంపీ వీరేంద్ర శర్మ, భారత హైకమిషన్ ప్రతినిధి అజయ్ కుమార్ ఠాకుర్, టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, కౌన్సిలర్లు ప్రీతమ్ గ్రేవాల్, అజ్మీర్ గ్రేవాల్, ప్రభాకర్ ఖాజా, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.
Details
కెనడాలో బతుకమ్మ సంబరాలు
ఈ వేడుకల్లో మహిళలు గౌరీదేవి పూజలు నిర్వహించి, బతుకమ్మ ఆటపాటలతో చేసిన నృత్యాలతో వేడుకలను మరింత రంగరించారు.
కెనడాలోని హాలిఫ్యాక్స్ నగరంలో కూడా బతుకమ్మ వేడుకలు అత్యంత ఆనందోత్సాహంగా జరిగాయి. మ్యారిటైం తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాలకు తెలంగాణ కుటుంబాలు పెద్ద సంఖ్యలో హాజరయ్యాయి.
మహిళలు గౌరీపూజలు నిర్వహించి, పూలతో బతుకమ్మలను పేర్చారు. సంప్రదాయ రీతిలో నృత్యాలు, ఆటపాటలు నిర్వహించి వేడుకలను ఎంతో ఉత్సాహంగా జరిపారు.
ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.