Page Loader
చైనాను ముంచెత్తుతున్న భారీ వరదలు.. 29 మంది మరణం, 16 మంది మిస్సింగ్
చైనాలో భారీ వరదలు.. 29 మంది మరణం, 16 మంది మిస్సింగ్

చైనాను ముంచెత్తుతున్న భారీ వరదలు.. 29 మంది మరణం, 16 మంది మిస్సింగ్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 11, 2023
04:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

చైనాను భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాల ధాటికి చైనాలోని హెబెయ్‌ ప్రావిన్స్‌లో భారీ వరదలు సంభవించాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లో ప్రాణ నష్టం జరిగింది. ఈ మేరకు వరదల కారణంగా మొత్తం 29 మంది చనిపోయారు. మరో 16 మంది గల్లంతయ్యారు. మరోవైపు భారీ వర్షాలు ఆర్థికంగానూ నష్టం చేసినట్లు అక్కడి అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు దాదాపుగా 95.811 బిలియన్‌ యువాన్‌ల నష్టాన్ని కలిగించినట్లు తేల్చారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న కుంభవృష్టితో ప్రావిన్స్‌లో వరదలు ఉద్ధృతమయ్యాయని చైనా ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. దీని కోసం 1.46 బిలియన్‌ యువాన్‌ల ఆర్థిక సాయాన్ని అదనంగా అందించామన్నారు. పునరావాస చర్యలకు 7.738 బిలియన్‌ నిధులను మంజూరు చేసిందన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

భారీ వర్షాల ధాటికి చైనాకు ఆర్థిక నష్టం